twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు, మిమిక్రి ఆర్టిస్టు హరికిషన్ కన్నుమూత.. తీవ్ర విషాదంలో టాలీవుడ్

    |

    తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ నటి వాణిశ్రీ కుమారుడు మరణవార్తతో విషాదంలో మునిగిన సినీ లోకానికి వెంటనే మరో మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎన్నో సంవత్సరాలుగా మిమిక్రీ కళకు సేవలందిస్తున్న కళాకారుడు, నటుడు హరికిషన్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వా విడిచారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు, మిమిక్రీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

    Recommended Video

    Mimicry Artist Hari Kishan Is No More
    నటుడిగా, హోస్టుగా పలు షోలతో

    నటుడిగా, హోస్టుగా పలు షోలతో


    పలు ఛానెల్స్‌లో షోలు నిర్వహించిన ఘనతను ఆయన సొంతం చేసుకొన్నారు. బుల్లితెరపై ఆయన షోలకు విశేషంగా ఆదరణ ఉండేది. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి నటుడినైనా అనుకరించే టాలెంట్ ఉన్న కళాకారుడిగా హరికిషన్‌కు పేరుంది. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోని ఆర్టిస్టులనే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ సినిమా నటులను అద్భుతంగా అనుకరించేవారు.

    పలు భాషలపై పట్టు

    పలు భాషలపై పట్టు

    అలాగే ఆయనకు భాషపై పట్టు, వాక్పటిమ, సమయస్పూర్తి ఆయనను మిమిక్రి రంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చింది. పలు భాషల్లోని అనేక మంది కళాకారులను, నటులను, రాజకీయ వేత్తలను చాలా సునాయసంగా వారి గొంతును అనుకరించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే.

    ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో

    ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో

    హరికిషన్ ప్రతిభకు ఆకర్షితులైన ప్రతి ఒక్కరు ఆయన కార్యక్రమాలను విశేషంగా ఆదరించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయన ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకొన్నారు. ఇలా ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

    అంత్యక్రియలపై సందిగ్దత

    అంత్యక్రియలపై సందిగ్దత


    అనారోగ్యంతో బాధపడుతున్న హరికిషన్ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన భౌతికకాయానికి పలువురు శ్రద్దాంజలి ఘటించారు. ఆయన సంతానం విదేశాల్లో ఉండటం కారణంగా వారు స్వదేశానికి వచ్చేంత వరకు ఆయన పార్దీవ దేహాన్ని మార్చురికి తరలించారు. ఆయన అంత్యక్రియలపై త్వరలోనే కుటుంబ సభ్యులు ప్రకటన చేసే అవకాశం ఉంది.

    English summary
    Mimicry Artist Hari Kishan no more. He was passed away due to ill health. Many of Film and mimicry personalities shocked with his death news
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X