మెగాస్టార్ అంటే పిచ్చి ప్రేమ .. చిరు తాగిన టీ కప్‌ని షోకేస్‌లో పెట్టి, ఈ కమెడియన్ రూటే సెపరేట్!
కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి తన కష్టం, ప్రతిభతో హేమహేమీలతో నిండిన తెలుగు చిత్ర పరిశ్రమను మూడున్నర దశాబ్ధాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. చిరు వేసిన బాటలో రవితేజ, శ్రీకాంత్, నాని తదితర నటీనటులు, టెక్నీషియన్స్ చిత్ర సీమలో అడుగుపెట్టారు. వారిలో కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి కూడా ఒకరు.
దివంగత నేరేళ్ల వేణుమాధవ్ స్పూర్తితో ఎంతోమంది మిమిక్రీ కళాకారులు తెలుగునాట సత్తా చాటారు. వారిలో శివారెడ్డి ఒకరు. ఈ తరంలో మిమిక్రీ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు శివారెడ్డి. ఎన్నో సినిమాల్లో, వేదికలపై ఎందరో ప్రముఖుల గొంతును మిమిక్రీ చేసి నవ్వులు పూయించి మిమిక్రీనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా పాటలతో, కామెడీతో , మిమిక్రీతో , డ్యాన్సులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు శివారెడ్డి. కొన్ని సినిమాల్లోనూ నటించి నటుడిగానూ సత్తా చాటారు.

తెలంగాణలోని రామగుండం పట్టణానికి చెందిన శివారెడ్డి దాదాపు 100 సినిమాలలో నటించడంతో పాటు దాదాపు 6 వేల స్టేజ్ షోలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని పలు నగరాలు, విదేశాల్లోనూ శివారెడ్డి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పలు టీవీ ఛానెల్స్‌లో యాంకర్‌గానూ పనిచేసిన శివారెడ్డి తర్వాత ఎందుకో వెనుకబడ్డారు. మీడియాకు దూరంగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత, సినిమా, మిమిక్రీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకునే తాను మిమిక్రీ, సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఎన్నో వేదికలపై చెప్పారు శివారెడ్డి. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. మెగాస్టార్‌ను శివారెడ్డి ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. సదరు ఛానెల్ ప్రతినిధికి తన ఇంట్లో తాను గెలుచుకున్న అవార్డులు, ట్రోఫీలను చూపించారు శివాజీ. ఈ క్రమంలో షోకేస్‌లో కనిపించిన కప్పు అందులో పెట్టిన స్టార్ వెరైటీగా అనిపించి సదరు మీడియా ప్రతినిధి ఇదేంటని అడుగుతాడు.
ఇది మెగాస్టార్ చిరంజీవి తాగిన టీ కప్పు అని.. ఆయన సగం టీ తాగిన తర్వాత ఆ కప్పు అడిగి నేను తాగానని, తర్వాత కప్పుని అడిగి ఇంటికి తెచ్చుకుని షోకేస్‌లో పెట్టుకున్నానని శివారెడ్డి తెలిపారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ కప్పును భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పగా.. లక్షలు ఇచ్చినా ఎవరికీ ఈ కప్పును ఇవ్వననని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చిరంజీవిపై శివారెడ్డి ప్రేమను చూసి మెగా ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు.


Click it and Unblock the Notifications











