సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మైండ్ బ్లాక్ వచ్చేస్తోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఊర మాస్ పాటకు స్టెప్పులేస్తే చూడాలన్నది కేవలం ఆయన అభిమానులకు కాదు.. సగటు సినీ ప్రేక్షకుడి కోరిక. అయితే ఇప్పటి వరకు మహేష్ సినిమాలో మాస్ బీట్స్ ఉన్నా కానీ.. ఏ ఒక్క దాంట్లో అదిరిపోయే స్టెప్పులు మాత్రం వేయలేదు. ఇన్నాళ్లకు సరిలేరు నీకెవ్వరు సినిమాతో అందరి కోరిక తీరింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ ఏ రేంజ్‌లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలోఈ పాట వస్తే చాలు థియేటర్లలోంచి లేచి డ్యాన్సులు వేసే వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అంతలా ఉర్రూతలూగించింది ఈ పాట.

Mind block Song Video Song On 29th February

దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన ఈ పాట మహేష్ బాబులోని కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. తన కెరీర్‌లోనే ఇంతలా రెస్పాన్స్ వచ్చిన పాట లేదని మహేష్ బాబే స్వయంగా చెప్పాడంటే దాని క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోండి. ఈ పాటను ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. ఈ చిత్రం వంద కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X