సలార్ 'టీజర్'తో ప్రశాంత్ నీల్ యూనివర్స్ కన్ఫామ్.. కేజీయఫ్‌కు లింక్.. ఇదిగో ఇవే ప్రూఫ్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రభాస్ సలార్ టీజర్ వచ్చేసింది. ఈ రోజు ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్‌ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అలారం పెట్టుకుని మరీ నిద్రలేచి సలార్ టీజర్ కోసం చూసి ఉంటారు. అయితే ఎట్టకేలకు రిలీజ్ కాగా... అంచనాలకు తగ్గట్టే.. టీజర్ అదిరిపోయింది. ఇక ఈ సలర్ టీజర్ చూస్తుంటే.. కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉందనే విషయం తెలుస్తోంది. దానికి కొన్ని ఫ్రూఫ్స్ ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ట్రెండింగ్ లో సలార్...:ప్రభాస్ సలార్ టీజర్ రానే వచ్చింది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే టీజర్ ఓ రేంజ్‌లో అదిరిపోయింది. భారీ పంచ్ డైలాగ్స్ లేకపోయినా... హీరోని పూర్తిగా చూపించకపోయినా.. ఆ ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. నెంబర్ వన్ ట్రెండింగ్ తో... మిలియన్ వ్యూస్ తో దూసుకువెళ్తోంది. ఇక ఈ టీజర్ 1 నిమిషం 46 సెకన్ల నిడివి ఉంది. ఈ టీజర్ తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

కేజీఎఫ్ తరహాలోనే సలార్...:కేజీఎఫ్ సిరీస్ తరహాలోనే.. ఈ సలార్ టీజర్ ను కట్ చేశారు. గత కొంత కాలంగా కేజీఎఫ్ కు కొనసాగింపుగానే సలార్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయినా టీజర్ తో అది కన్ఫామ్ అయింది. టీజర్ లో గమనిస్తే... కేజీఎఫ్‌కు సలార్ కొనసాగింపు నిజమేనని కన్ఫామ్ అవుతుంది. ఇందులో రాఖీ భాయ్ కూడా ఉంటారనేందుకు మరింత బలం కూడా చేకూరింది. దీనికి పక్కా ఫ్రూఫ్స్ కూడా ఉన్నాయి.
సలార్ కేజీఎఫ్ కనెక్షన్:కేజీఎఫ్ 2 లేదా ఈ సిరీస్ కు లింక్ అయ్యేలా ప్రభాస్ సలార్ ఉండబోతుందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కేజీఎఫ్ చాప్టర్ 2 లో రాకీభాయ్ నిర్మించుకున్న తన సామ్రాజ్యం లో కొన్ని ఫ్యాకర్టీ నంబర్స్ అలాగే ఇపుడు సలార్ టీజర్ లో చూపించిన నంబర్స్ ఒకేలా ఉన్నాయి. దీనితో ఈ రకంగా లింక్ ఉందని కన్ఫర్మ్ అయింది. ఇక ఈ టీజర్ లో ఆఫ్రికన్స్ గ్యాంగ్ కనిపిస్తున్నారు. మరి కేజీయఫ్ 1 లో బంగారం ఆఫ్రికా నుంచి రావట్లేదు కేజీఎఫ్ నుంచే వస్తుంది అని రాకీ తెలుసుకుంటాడు అనే సీన్ ఉంటుంది. అంటే ఆ ఆఫ్రికా కనెక్షన్ ఇలా కుదిరిందని అంటున్నారు.

ఇనాయత్ ఖలీల్ కొడుకే సలార్:అలాగే సలార్ అనేది ముస్లిం పేరు. కేజీఎఫ్ చాప్టర్ 2 లో చూపించిన ఇనాయత్ ఖలీల్ కొడుకు సలార్ అని సోషల్ మీడియాలో అంటున్నారు. ఇలా సలార్ కి కేజీఎఫ్ కి ఇంట్రెస్టింగ్ లైన్స్ ఇప్పుడు కలుస్తూ ఉండడం మరింత క్రేజీ థింగ్ గా ఇప్పుడు మారింది. ఇక కేజీయఫ్ సినిమా గోల్డ్ మైన్స్‌లో సాగుతుంది. అయితే సలార్ బొగ్గు గనుల నేపథ్యంలో ఉంటుందని అర్థం అవుతుంది. మొత్తానికి సలార్ కి, కేజీఎఫ్ కు లింక్ ఉంటుందని.. ఇదంతా ప్రశాంత్ నీల్ యూనివర్స్ అని అంటున్నారు.

సీజ్ ఫైర్ అంటే ఇదే..:ఇక కేజీయఫ్ మాదిరే సలార్ కూడా రెండు పార్టులుగా రాబోతుంది. అందులో పార్ట్ 1 కి సీజ్ ఫైర్ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే.. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు... హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు కానీ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడే సీజ్ ఫైర్. రెండో ప్రపంచ యుద్ధంలో మొదటిసారి ఈ పదాన్ని వాడారు. ఇప్పుడు ఈ పదాన్ని ఈ సినిమాలో వాడారంటే.. ప్రభాస్ వేట ఎంత వైల్డ్‌గా ఉంటుందోనని అంటున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











