ఇదేం ట్రాన్స్ఫర్మేషన్ బాబోయ్.. 'గని' దెబ్బ మామూలుగా లేదుగా!
మెగా హీరో వరుణ్ తేజ్ గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఇక వరుణ్ తేజ్ గనిగా రూపాంతరం చెందడానికి సంబందించిన స్నీక్ పీక్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాక్సర్ పాత్రను పోషిస్తున్న వరుణ్ ప్రో అథ్లెట్ లాగా కనిపిస్తున్నాడు. ఇక అలా కనిపించడానికి తీవ్రంగా శిక్షణ పొందాడని అర్ధం అవుతోంది.
గని సినిమా కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా కోసం పని చేసిన యాక్షన్ కంపోజర్లు పని చేస్తున్నారు. ఇక హాలీవుడ్ నుంచి వచ్చిన లార్నెల్ స్టోవల్ మరియు వ్లాడ్ రింబర్గ్ ఈ యాక్షన్ ఎపిసోడ్లను పర్యవేక్షిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ 'గని' సినిమాతో సాయి మంజ్రేకర్ టాలీవుడ్‌లో డెబ్యూ ఇస్తోంది. జగపతి బాబు, నవీన్ చంద్ర, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా లాంటి వారు నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

నిజానికి ఈ సినిమాని అల్లు బాబి ఒక్కరే నిర్మించడం లేదు. ఆయన తన స్నేహితుడు సిద్ధూతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి సినిమా మొత్తం వరుణ్ తేజ్ ఒకే ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డైట్ విషయంలో కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సి వస్తోందని అంటున్నారు. ఇక షూటింగ్ లేట్ అయిన కొద్దీ వరుణ్ తేజ్ కు ఆ విషయంలో కాస్త అసహనం నెలకొంటుందని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఈ అంశం మీద అలాంటిది ఏమీ లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











