గాలి జనార్థన్ రెడ్డి కొడుకు హీరోగా తెలుగు మూవీ.. రాజమౌళి క్యాంప్ నుంచి డైరెక్టర్.. ఎవరంటే!
ఐరన్ మైనింగ్ వ్యాపార వేత్త, కన్నడ బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా తెలుగు, కన్నడ చిత్రం షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‌లో జరుగుతున్నది. మీడియాకు దూరంగా ఎలాంటి హంగు అర్బాటం లేకుండా సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొంటున్నది. గతంలో కన్నడ చిత్రం ద్వారా పరిచయమైన కిరిటీ.. తన రెండో సినిమాను తెలుగు దర్శకుడితో కలిసి చేస్తున్నాడు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
హీరో గాలి కిరిటీ గతంలో కన్నడ చిత్రంలో నటించారు. 2022 సంవత్సరంలో వచ్చిన ఆ చిత్రంలో శ్రీలీల, జెనీలియా డిసౌజా తదితరులు నటించారు. ఆ చిత్రానికి కన్నడ దర్శకుడు రూపొందించగా.. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రం పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.

అయితే ఈ సారి భారీ విజయాన్ని అందుకొనేందుకు కిరిటీ ప్లాన్ చేశారు. యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రానికి దర్శక ధీరుడు రాజమౌళి వద్ద పలు చిత్రాలకు సహాయకుడిగా వ్యవహరించిన త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో షూటింగ్ జరుపుకొంటున్నది.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించేందుకు ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖ నటులతోపాటే కన్నడ చిత్రానికి చెందిన స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమైనట్టు తెలుస్తున్నది.
గతంలో త్రికోటి పేటా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం అంతగా ఆడలేకపోవడంతో చాలా సమయం తీసుకొని రెండో ప్రాజెక్టుకు రెడీ అయ్యారు. అయితే ఈ సారి త్రికోటి మాత్రం తన మార్కు వదలకుండా హిట్టు కొట్టాలనే తపనతో సినిమా చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే కిరిటీ, త్రికోటి కాంబినేషన్‌కు సక్సెస్ దక్కుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
దర్శకుడు త్రికోటి పేటా విషయానికి వస్తే..బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, RRR చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. జువ్వ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రెండో సినిమాకు దర్శకత్వం వహిస్తూ తెలుగు ప్రేక్షకులకు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకును పరిచయం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











