SS Rajamouli పై మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం.. బాహుబలి, RRR సినిమాలతో తెలుగు ఖ్యాతి ఆ స్థాయికి అంటూ..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి హరీష్ రావు, ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సభలో ఒకరికొకరు ప్రశంసల్లో అభినందించుకొన్నారు. రాజమౌళిపై హరీష్ ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఆయనకు సన్మానం చేశారు. రాజమౌళికి పుష్పగుచ్ఛం అందించారు. శాలువాతో హృదయపూర్వకంగా సన్మానం చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావుకు రాజమౌళి కూడా శాలువాతో సన్మానం చేయడం విశేషంగా మారింది. ఈ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..
ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి గారి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయనను ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు గొప్ప దర్శకుడు. బాహుబలి సినిమాతో తెలుగు జాతి ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. ఆ తర్వాత RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి. ఆయన నా అభినందనలు అని హరీష్ రావు అన్నారు.

ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను చాలా సార్లు కలుసుకొన్నాను. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. మేము ఎంఎన్ జే హాస్పిటల్‌ను కడితే.. ఆ హాస్పిటల్ సానిటైజేషన్ బాధ్యతను తన స్నేహితుడితో కలిసి తీసుకొన్నారు. దాదాపు 400 పడకల హాస్పిటల్ సానిటైజేషన్ బాధ్యతను నిర్వహించడం గొప్ప విషయం. ఎంతో పేదలకు వారు సహాయం చేస్తుంటారు అని మంత్రి హరీష్ రావు అన్నారు.
దర్శకుడు రాజమౌళి గారు కూడా ఎంతో మంది చిన్న పిల్లలకు, ఆపదలో ఉన్న వారికి డాక్టర్ సతీష్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషం వేసింది. ఇప్పుడు హాస్పిటల్‌కు వచ్చిన తర్వాత ఆయన గురించి మరో విషయం తెలిసింది. డాక్టర్ సతీష్‌కు తగినట్టే ఆయన కూతురు సేవలో ఉన్నారు. సతీష్ ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఒక సేవా దృక్పథం ఉందని తెలిసింది అని హరీష్ రావు చెప్పారు.
రాజమౌళి సినిమాల్లో దేశభక్తి ఉంటుంది. అంతర్లీనంగా కమర్షియల్ అంశాలు ఉంటాయి. సినిమా అన్నప్పుడు కమర్షియల్‌గా ఉండాల్సిందే. కానీ ఆయన సినిమాల్లో సమాజంలోని రుగ్మతలు, వాటిని తొలగించే సందేశం, అంతర్లీనంగా సందేశం నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఇంకా ఇంకా ఎదగాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని హరీష్ రావు అన్నారు.


Click it and Unblock the Notifications











