వరంగల్ యువకుడి ప్రాణాలు నిలబెట్టిన మంత్రి హరీష్ రావు, శేఖర్ కమ్ముల.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురు చూస్తున్న ఓ యువకుడికి తెలంగాణ మంత్రి హారీష్ రావు, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అండగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న యువకుడికి మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకొన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
వరంగల్‌కు చెందిన హర్షవర్థన్ అనే యువకుడు క్రాన్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. తనకు మెరుగైన వైద్యం అందేలా సహాయం చేయాలని దర్శకుడు శేఖర్ కమ్ములను కోరారు. ఆ యువకుడి పరిస్థితితో భావోద్వేగానికి గురైన శేఖర్ కమ్ముల వెంటనే తెలంగాణ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. శేఖర్ కమ్ముల అభ్యర్థనపై వెంటనే స్పందించిన హరీష్‌రావు నిమ్స్ హాస్పిటల్‌లో హర్షవర్ధన్‌కు చికిత్స అందించాలని ఆదేశాలు ఇచ్చారు.

తాను కోరిన వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన హరీష్‌రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ రావు ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని శేఖర్ కమ్ములు తన ట్వీట్ లో పేర్కొన్నారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు నిత్యం ఎవరో ఒకరు తమకు మెరుగైన వైద్యాన్ని అందించేలా సహకరించాలని పలువురు కోరుతున్నారు.
అయితే శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపిన ట్వీట్‌పై హరీష్‌రావు స్పందించారు. హర్షవర్ధన్ ప్రాణాపాయం నుంచి బయటపడి క్షేమంగా ఉన్నారని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కారణమైన నిమ్స్ వైద్యుల సేవలకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అని హరీష్ రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











