Rashmika Mandanna DeepFake Video: రష్మిక మార్ఫింగ్ వీడియో‌పై కేటీఆర్ రియాక్షన్.. ఎలక్షన్ల బిజీలోను ఏమన్నారంటే?

KTR on Rasmika Morphing Video: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఆమె అందం, సినిమాల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ ఫేక్ వీడియోతో నెట్టింట రచ్చ సాగుతోంది. సోషల్ మీడియా మొత్తం రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ వీడియోపై చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా దీనిపై రియాక్ట్ కాగా.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కు.. రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై ప్రశ్న ఎదురైంది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్ నటి రష్మిక డీప్ ఫేక్ వివాదంపై స్పందించారు. రష్మిక మందన్నాకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా తాను కూడా తెలుసుకున్నానని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం చాలా దారుణం అని చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకుంటూ మహిళలపై ఇలాంటి వేధింపులకు పాల్పడడం చాలా సరికాదని వివరించారు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్నాకు తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Minister KTR Responds on Rashmika Mandanna Deepfake Video Check Details

అంతేకాకుండా ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే బాగుంటుందని.. నిజంగా అలాంటిది వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో వాటిని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి కేటీఆర చెప్పుకొచ్చారు. ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. మంత్రి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రజలు కూడా రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియోపై స్పందిస్తున్నారు.

ఇటీవలే ఈ వీడియోపై బాధితురాలు అయిన హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ ను రాసుకు వచ్చింది. ఈ వీడియో తనను చాలా బాధించింది వివరించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తన డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఈ మార్ఫింగ్ వీడియో కేవలం తనకు మాత్రమే భయాన్ని కల్పించడం లేదని, టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూసి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది.

Minister KTR Responds on Rashmika Mandanna Deepfake Video Check Details

ఇదే తాను చదువుకునే రోజుల్లో జరిగి ఉంటే తన పరిస్థితి ఏంటోనని చెబుతూ చాలా ఎమోషనల్ అయింది. అలాగే తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చింది. అలాగే ఈ వీడియోలో ఉన్న అమ్మాయి జరా పటేల్ కూడా దీనిపై స్పందించింది. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కాగా.. తను వీడియోనే మార్ఫింగ్ చేశారని.. కానీ తనకు ఈ డీప్ ఫేక్ వీడియోతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X