సైరా ఫంక్షన్‌కు కేటీఆర్ డుమ్మా.. కారణం ఏమిటో తెలుసా?

Recommended Video

KTR Will Not Attend Sye Raa Audio Function || కారణం ఏమిటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. కేవలం తెలుగు చిత్రసీమలోనే కాదు.. భారత చలనచిత్ర సీమలో తనకంటూ కొన్ని పేజీ లను లిఖించుకున్న కథానాయకుడు. తన అభిమాన ఘనంతో అంతులేని సేవా కార్యక్రమాలు చేస్తూ.. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. పదేళ్ళ విరామం తరువాత వెండితెరపై ఖైదీ నెం.150గా కనిపించి కనువిందు చేశారు.

స్వతంత్ర సమరయోధుడి కథతో..

స్వతంత్ర సమరయోధుడి కథతో..

స్వతంత్ర సమరయోధుడి కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. దర్శకత్వంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి.

గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్...

గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్...

ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో.. భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఈ నెల 18న జరగనున్న ఈ వేడుకలో మెగా హీరోలందరూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మగధీర అనంతరం మళ్ళీ ఇప్పుడే అందరూ కలసి ఒకే వేదికపై కనిపించనున్నారని మెగా అభిమానులు సంబరపడుతున్నారు. పవన్ కళ్యాణ్, కొరటాల శివ ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా రానున్నారు.

కారణం అదేనట

కారణం అదేనట

రామ్ చరణ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ మంచి స్నేహితులు. అప్పుడప్పుడు వారిద్దరూ కలుసుకొంటారు. కేటీఆర్, ప్రభుత్వ పథకాలకు అండగా ఉంటాడు. అందుకే ఈ ఈవెంట్ రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను కోరారట. ఆ మేరకే కేటీఆర్ ఒప్పుకొన్నారట. కానీ అనూహ్యంగా తన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ముందస్తు డిసైడ్ అయిన కార్యక్రమాలు ఉండటంతో రాలేక పోతున్నానని చెప్పాడట. ఆ మధ్య రామ్ చరణ్.. రంగస్థలం, వినయ విధేయ రామ చిత్రాల ఈవెంట్లకు కేటీఆర్ విచ్చేసిన సంగతి తెలిసిందే.

 ప్రపంచవ్యాప్తంగా 2న సైరా

ప్రపంచవ్యాప్తంగా 2న సైరా

ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రంలో ఎంతో మంది దిగ్గజ నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్, మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, లేడీ సూపర్ స్టార్ నయనతార, తమన్నా, జగపతి బాబు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X