DJ Tillu పాటకు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. తేలిపోయిన హీరో సిద్దూ జొన్నలగడ్డ!
విద్యా సంస్థల అధినేత, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి జోష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సభ ఏదైనా అతిథులను హుషారెత్తించే మాటలు, చేతలతో ఆకట్టుకోవడం ఆయన నైజం. అయితే సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో మల్లారెడ్డి మరోసారి మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఉత్సవాల వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి వేడుకల్లో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీల కైట్ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది యువకులు తరలివచ్చారు. ఈ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, సిద్దు చేసిన ప్రసంగాలు విద్యార్థులను ఆకట్టుకొన్నాయి.

వేడుకల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి వేదికపై ప్రతీ క్షణం ఉల్లాసంగా కనిపించారు. సిద్దూను ఉత్సాహ పరుస్తూ డీజే టిల్లూ టైటిల్ సాంగ్‌పై స్టెప్పులు వేశారు. సిద్దూ, మల్లారెడ్డి వేసిన స్టెప్పులకు వేదిక దద్దరిల్లింది. మల్లారెడ్డి వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అనంతరం సిద్దూతో డ్యాన్సులు వేయించే ప్రయత్నం చేశారు. అనంతరం మల్లారెడ్డి మనవడితో కలిసి కాసేపు సిద్దూ స్టెప్పులేశారు.
ప్రస్తుతం డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. ఏది ఏమైనా మంత్రి మల్లారెడ్డి జోష్ ముందు సినీ నటులైనా దిగదుడుపే అనే మాట సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











