నాగ చైతన్య కస్టడీ రిలీజ్ రోజు పరీక్షలు వాయిదా, కాలేజీలకు హాలీడే.. మంత్రి షాకింగ్ నిర్ణయం
హీరో నాగ చైతన్య టాలీవుడ్ లో గుడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. తనదైనట శైలీలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. హిట్లు ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిన మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.
చైతూ తాజాగా నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమాకు విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో తాజాగా కస్టడీ సినిమా విడుదల రోజు విద్యార్థులకు పరీక్షలు ఉంటే వాయిదా వేస్తామని మంత్రి షాకింగ్ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

పోలీస్ ఆఫీసర్: నాగ చైతన్య తాజాగా ద్విభాష చిత్రంలో నటిస్తున్నాడు. కస్టడీ అనే మూవీ ద్వారా ఒకేసారి ఇటు తెలుగు, అటు తమిళం బైలింగువల్ ప్రాజెక్టుతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. చైతూకి తొలి తమిళ్ స్ట్రెయిట్ సినిమా అయిన కస్టడీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. దీన్ని ఈ ఏడాది మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
తండ్రీకొడుకులు తొలిసారిగా: కస్టడీ సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించగా కృతీ శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, తదితరులు కీలక పాత్రలుపోషిస్తున్నారు. కస్టడీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు తండ్రీకొడుకులు ఒకేసారి పనిచేయడం ఇదే తొలిసారి.

ఏకంగా 13 కాలేజీలు: ఇదిలా ఉంటే తాజాగా మంత్రి మల్లా రెడ్డి విద్యా సంస్థలు అయిన సీఎంఆర్ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య పాల్గొన్నాడు. ఈ సందర్బంగా కస్టడీ టీజర్ ను విడుదల చేశారు. ఈ క్రమంలోనే మాట్లాడిన మంత్రి తన సక్సెస్ స్టోరీ చెప్పుకొచ్చారు. తన దగ్గర కేవలం ఒక సైకిల్ రెండు పాల క్యాన్లు మాత్రమే ఉండేవని, ఈరోజు ఆయనకు ఏకంగా 13 కాలేజీలు ఉన్నాయని, వాటితో 65 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు పేర్కొన్నారు.
చైతూ కొనసాగిస్తున్నారు: దేశంలో టాప్ టెన్ ఎడ్యుకేషనలిస్ట్ జాబితాలో మంత్రి మల్లారెడ్డి ఉన్నాడంటే దాని వెనుక చాలా కష్టం ఉందని మంత్రి మల్లా రెడ్డి వెల్లడించారు. ఇక ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు అభిమాని అని చెప్పుకొచ్చారు. ఆయన లెగసినీ నాగ చైతన్య కొనసాగిస్తున్నారని అన్నారు. కస్టడీ సినిమా టీజర్ ను తమ కాలేజీ వేడుకలో విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు.

డుమ్మా కొట్టండి: నాగ చైతన్య కస్టడీ మూవీ మే 12న విడుదల కానున్న నేపథ్యంలో ఆరోజు విద్యార్థులంతా కాలేజీలకు డుమ్మా కొట్టి సినిమాకు వెళ్లాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్పెషల్ క్లాసులు ఉన్నా బంక్ కొట్టండంటూ స్టూడెంట్స్ కు బహిరంగా చెప్పి ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా వేదికపై మంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఆరోజు తమ విద్యా సంస్థలన్నింటికీ వీలైతే సెలవు ప్రకటించనున్నట్లు సమాచారం. ఆరోజున ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే వాటిని వాయిదా వేసే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











