అక్కినేని ఫ్యాన్స్ తేల్చుకోవాలి.. బాలకృష్ణపై మంత్రి రోజా మండిపాటు.. నాగబాబును కూడా లాగి..!

నందమూరి బాలకృష్ణ ఇటీవల అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు ఊహించిన విధంగా తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే అక్కినేని హీరోలు కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాలయ్య బాబుపై ఊహించిన విధంగా కౌంటర్ అయితే ఇచ్చారు.

అయితే ఇప్పుడు రాజకీయపరంగా కూడా ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది రాజకీయ నాయకులు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఈ విషయంలో బాలయ్య బాబు పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగబాబుని కూడా వివాదాల్లోకి లాగడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

 అక్కినేని తొక్కినేని అనడంతో..

అక్కినేని తొక్కినేని అనడంతో..

నందమూరి బాలకృష్ణ రీసెంట్గా వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన సక్సెస్ మీటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ వేడుకలో వివిధ రకాల విషయాల గురించి మాట్లాడిన బాలయ్య బాబు సెట్ లో కూర్చున్నప్పుడు నాన్నగారు రంగారావు అలాగే అక్కినేని తొక్కినేని ఇలా ఎన్నో విషయాలు గురించి మాట్లాడుకుంటామని చెప్పారు. దీంతో ఆ విధంగా మాట్లాడడం పై అక్కినేని ఫాన్స్ అయితే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని హీరోల రియాక్షన్

రీసెంట్ గా అక్కినేని యువ హీరోలు అక్కినేని నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సీనియర్ నటీనటులను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరికీ పైన ఉంది అని వారిని గౌరవించలేక పోతే మనల్ని మనం గౌరవించుకోలేనట్లే అని కూడా వారు కూల్ గా కౌంటర్ అయితే ఇచ్చారు.

ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఈ విషయంలో బాలయ్య బాబుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అని గతంలో నాగబాబు గారు ఎలాగైతే కోటా శ్రీనివాసరావు గారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసి దూషించారో మనందరం చూసాము.ఇక్కడ ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అదే తరహాలో అన్నారు అని రోజా తెలిపారు.

ఎలా తట్టుకుంటారు..

ఎలా తట్టుకుంటారు..

ఎన్టీఆర్ కొడుకు అయి ఉండి దాదాపు ఎన్టీఆర్ తరహాలోనే క్రేజ్ అందుకున్న ఏఎన్నార్ గురించి ఆ విధంగా తప్పుగా మాట్లాడడం అనేది సరైనది కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్ తరహాలోనే గొప్ప మహానటుడు. ఎన్టీఆర్ కు ఎలాంటి గౌరవం ఉంటుందో ఆయనకు కూడా అలాంటి గౌరవమే ఉంటుంది. ఒకవేళ ఎన్టీఆర్ ను ఆ విధంగా ఏమైనా అంటే వారు కూడా ఇలానే బాధపడేవారు. అదే తరహాలో ఏఎన్ఆర్ ను అంటే వారి అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా ఎలా తట్టుకుంటారు? అనే విషయం వారికే తెలియాలి.. అని అన్నారు.

 అభిమానులే తేల్చుకోవాలి

అభిమానులే తేల్చుకోవాలి

గతంలో కూడా ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటివరకు అలాంటి విషయాలలో ఆయనకు ఎప్పుడూ కూడా పెద్దగా పనిష్మెంట్ ఇచ్చింది లేదు. అందుకే ఈ విధంగా కామెంట్ చేశారు. ఇక ఈ విషయం గురించి అక్కినేని అభిమానులే మరోసారి తేల్చుకోవాలి అని రోజా గారు చాలా ఘాటుగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ నుంచి ఈ విధంగా రియాక్షన్ వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X