Mirai Glimps Review తేజా సజ్జా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా? మిరాయ్ మరో హనుమాన్ కాబోతున్నదా?

తెలుగు సినిమా పరిశ్రమలో ఓవర్‌నైట్‌లో పాన్ ఇండియా స్టార్‌గా మారిన హీరో తేజా సజ్జా. ఇంద్ర లాంటి సినిమాల్లో బాలనటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూశాడు. అయితే ఆయన నిరీక్షణ ఫలించి హను మ్యాన్ రూపంలో బ్లాక్ బస్టర్ లభించింది. అయితే హనుమ్యాన్ తర్వాత తేజ తన కెరీర్‌ను భారీగా ప్లాన్ చేసుకొంటున్నట్టు తాజాగా వచ్చిన మిరాయి మూవీ గ్లింప్స్ గట్టిగా నమ్మకం కలిగించింది. ఈ సినిమా గ్లింప్స్ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి బరిలో రిలీజైన హనుమ్యాన్ సినిమా ఊహించని విజయాన్ని అందుకొన్నది. ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతీ భాషలోను సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం సుమారుగా 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా తేజా సజ్జా కెరీర్‌కు గట్టి పునాది ఏర్పరించింది.

Mirai Glimps Review Will Teja Sajja gets another blockbuster Mirai like Hanuman

ఇక తేజా సజ్జాకు హనుమాన్ రిలీజ్‌కు ముందు భారీ ఆఫర్లు వచ్చాయనేది టాక్. అయితే తాను మాత్రం ఆ సినిమా రిలీజ్ వరకు టెంప్ట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కంటెంట్ ప్రధానమైన సినిమాలను ఎంచుకొంటున్నట్టు తాజాగా మిరాయి సినిమా రుజువు చేసింది.

మిరాయ్ విషయానికి వస్తే.. యువ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ యోధగా కనిపించబోతున్నారు. అశోక సామ్రాట్ హిస్టరీ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ దేవ రహ్యస్యాన్ని ఛేదించడానికి వచ్చిన యోధుడి కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

Mirai Glimps Review Will Teja Sajja gets another blockbuster Mirai like Hanuman

యాక్షన్, ఎమోషన్స్ కలబోసిన చిత్రంగా మిరాయ్ రూపొందుతుందనే భావన కల్పించింది. ఈ గ్లింప్స్‌తోనే మరో బలమైన కథ తెలుగు తెరనే కాదు.. ఇండియన్ స్క్రీన్స్‌ను తాకబోతుందనే ఫీలింగ్ కలిగింది. అంతేకాకుండా తేజా సజ్జాకు మరో హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ కాబోతుందా అనే నమ్మకం కలిగించింది.

మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో 3డీలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీ 2025 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X