twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిర్చి’ టైటిల్ ప్రభాస్‌ది కాదా..? వైరల్‌గా మారిన దర్శకుడి ట్వీట్

    |

    మిర్చి చిత్రం రిలీజ్ కాకముందు ఉన్న ప్రభాస్ వేరు.. ఆ మూవీ విడుదలయ్యాక ప్రభాస్ వేరు. అంతకుముందెన్నడూ చూపించనంత స్టైలీష్‌గా డార్లింగ్‌ను చూపించాడు దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మిర్చి అనే యాప్ట్ టైటిల్‌ను పెట్టారు. ఆ టైటిల్, టైటిల్‌తో సాగే ఓపాట ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ టైటిల్‌ను అంతకుముందు ఓ యంగ్ హీరో కోసం మరో సంస్థ బుక్ చేసినట్టు తెలుస్తోంది.

    సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్..

    సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్..

    సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన తూనీగ తూనీగ చిత్రం గుర్తుండే ఉంటుంది కదా. ఆ చిత్రానికి మొదటగా మిర్చి అనే టైటిల్ అనుకున్నారట. అయితే మరి ఎందుకు మార్చారో తెలీదు కానీ ఫైనల్‌గా తూనీగ తూనీగ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ చిత్రం 2012 జూలైలో రిలీజ్ కాగా.. మిర్చి 2103 ఫిబ్రవరిలో విడుదలైంది.

    దర్శకుడి ట్వీట్‌తో బయటకు..

    తూనీగ తూనీగ చిత్రానికి అంతకు ముందు మిర్చి అనే టైటిల్ అనుకున్నారన్న విషయం సాయి రాజేశ్ (హృదయ కాలేయం, కొబ్బరి మట్ట ఫేమ్) ట్వీట్ వల్ల తెలిసింది. ఆయనఅసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాటి కాలాన్ని గుర్తుచేసుకున్న సందర్భంలో ఈ విషయం బయటకు వచ్చింది.

    తండ్రికిచ్చిన రూ.500 నోటు..

    తండ్రికిచ్చిన రూ.500 నోటు..

    ‘సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో మిర్చి ( ఆ తరువాత తూనీగ తూనీగ) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో నా మొదటి రెమ్యూనరేషన్‌లో మొదటి నోటును మా నాన్నకి ఇచ్చాను.. అది ఆయన లాకర్ నాకు ఇప్పుడు కనిపించింది. దాన్నిఆయన లామినేషన్ చేయింది లాకర్‌లో భద్రంగా దాచుకున్నార'ని ట్వీట్ చేశాడు.

    ఏం జరిగి ఉంటుందో..?

    ఏం జరిగి ఉంటుందో..?

    సుమంత్ కోసం అనుకున్న మిర్చి టైటిల్.. ప్రభాస్ వద్దకు ఎలా చేరిందన్న ప్రశ్నకు సమాధానం దర్శకులే చెప్పాలి. ఒక్కసారి మిర్చి టైటిల్‌లో ప్రభాస్‌ను ఊహించుకున్నాక.. అభిమానులు ఆ టైటిల్‌లో ఇంకో హీరోను అసలు చూడలేరు. మిర్చి ఆ ఏడాదిలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి ప్రభాస్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది.

    English summary
    Mirchi Title Is Registered For Sumanth Ashwins Tuneega Tuneega Earlier. Director Sai Rajesh Tweet Goes Viral. I gave my first remuneration's first currency note to my dad which was from Suman Art Productions "Mirchi"( Later title was changed to 'Tooneega Toonega") as a Assistant director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X