twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక దాడుల నేపథ్యంగా మిర్రర్.. సమాజానికి అద్దం పట్టే స్టోరీతో

    |

    ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరుగుతోన్న అకృత్యాలను ఆధారంగా తీసుకొని మిర్రర్ చిత్రాన్ని తెరకెక్కించారు శ్రీ మల్లిఖార్జున మూవీస్ వారు. ఈ చిత్రానికి ఎ .సాయి కుమార్ దర్శకుడు. శ్రీనాథ్, హరిత జంటగా నటించారు. నెల 27న సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భంగా ఎన్ . అర్జున్ సంగీతాన్నీ సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ప్రసాద్ లాబ్స్ లో సోమవారం రిలీజ్ చేసారు.
    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ బిగ్ సీడీ ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ...ప్రస్తుత సమాజంలో ఆడవారి పై జరుగుతోన్న వేధింపులను బేస్ చేసుకొని ఈ సినిమా చేసారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. నిజంగా ఇది గొప్ప విషయం. ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇంత మంచి ప్రయత్నాన్ని చేసిన దర్శక నిర్మాతలను అభినందిస్తూ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

    ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయడమే పెద్ద విజయం తో సమానం అని మాజీ మంత్రి పుష్పలీల చెప్పారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ ... మిర్రర్ టైటిల్ , పాటలు బావున్నాయి. మధుర ఆడియో ద్వారా పాటలు రిలీజ్ చేస్తున్నాం. టీం అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు. ట్యూన్స్ కంపోజ్ చేయడమే కాకుండా లిరిక్స్ రాసే అవకాశం కల్పించిన దర్శకుడు సాయి కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.సినిమా చూసాను . నచ్చి డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ గారి ద్వారా ఈ నెల 27న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయిస్తున్నాఅన్నారు గూడ రామకృష్ణ.

     Mirror movie audio released grandly

    హీరో శ్రీనాథ్ మాట్లాడుతూ...దర్శకుడు అన్నీ తానై ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మా కో- ప్రొడ్యూసర్స్ సహకారం వల్లే సినిమాను రిలీజ్ చేయగలుగుతున్నాం. ఈ నెల 27న వస్తోన్న మా సినిమాను చూసి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నా అన్నారు.

    కో -ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ ...సాయి కుమార్ చెప్పిన కథ, ఆయన వర్క్ నచ్చి సినిమాలో భాగం అయ్యాము. సినిమా చాలా బాగా వచ్చింది. సందేశం, వినోదం కలగలిసిన సినిమా అని తెలిపారు.
    కెమెరా ఆపరేటర్ గా చాలా సినిమాలకు పని చేశాను . ఆ ఎక్స్పీరియెన్స్ తో ఈ సినిమాకు డైరెక్షన్ చేశాను. ఆడవారిని వేధిస్తూ పెద్ద మనుషులుగా కొంత మంది చలామణి అవుతున్నారు. అలాంటి వారిని తన ధైర్య సాహసాలతో ఒక అమ్మాయి ఎలా ఎదుర్కొన్నది అనేది మా సినిమా కథాంశం. కమర్షియల్ అంశాలు కూడా మెండుగా ఉన్నాయి. సినిమా విడుదల విషయం లో మాకు సహకరిస్తోన్న గూడ రామకృష్ణ గారికీ , డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ గారికి కృతజ్ఞతలు అన్నారు.

    విఠల్, మధు, డి. సుధాకర్ వినోద్ రాజ్ తదితరులు
    కెమెరా: కె అశోక్ రెడ్డి;
    మ్యూజిక్ : అర్జున్ ఎన్ ;
    ఎడిటర్: నరేష్ ;
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్ష ప్రవీణ్ ;
    కో-ప్రొడ్యూసర్స్: డి .లక్ష్మి నారాయణ, టి. అరుణ్ కుమార్; ఎన్ . అశోక్ కుమార్ ; డి .వినోద్ రాజ్
    స్టోరీ, స్క్రీన్ ప్లే ,డైరెక్షన్ : ఎ .సాయి కుమార్ .

    English summary
    Mirror movie based on physical attacks on women which is directed by A Sai Kumar. This movie function held in Hyderabad recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X