బాలకృష్ణ కోసం రిస్క్ చేస్తున్న ప్రొడ్యూసర్.. ఆ నమ్మకంతోనే ఇలా ప్లాన్ చేశాడా.!

By Manoj

Recommended Video

Nandamuribalakrishna & Boyapati Srinu New Movie Launch

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కలయికలో గతంలో 'సింహా', 'లెజెండ్' అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. వీటి తర్వాత ఈ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, శుక్రవారమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలేమీ బయటకు రాకముందే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా విషయం.? వివరాల్లోకి వెళితే..

పవర్‌ఫుల్ డైలాగుతో స్టార్ట్

పవర్‌ఫుల్ డైలాగుతో స్టార్ట్

నటసింహా నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం' అంటూ పవర్‌ఫుల్ డైలాగు చెప్పి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

 రికార్డు క్రియేట్ చేస్తారా?

రికార్డు క్రియేట్ చేస్తారా?

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి కలయికలో గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్ సినిమాలు వచ్చాయి. దీంతో ఈ కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యాన్స్‌కు భలే ఇష్టం. ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి కలవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ చేస్తారేమో చూడాలి.

ఆయనకు కచ్చితంగా ముఖ్యమే

ఆయనకు కచ్చితంగా ముఖ్యమే

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన బోయపాటి ఈ మధ్య స్పీడు తగ్గించాడు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆయన నిరాశకు గురయ్యాడు. దీంతో బాలయ్య సినిమాను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా హిట్ ఆయనకు బాగా అవసరం అనే చెప్పాలి.

 బాలకృష్ణ కోసం రిస్క్ చేస్తున్న ప్రొడ్యూసర్

బాలకృష్ణ కోసం రిస్క్ చేస్తున్న ప్రొడ్యూసర్

ఈ సినిమా ప్రారంభమైన తొలి రోజే ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఈ ప్రాజెక్టుకు రూ. 70 కోట్లు కేటాయించారనేదే ఆ వార్త సారాంశం. గతంలో బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో హిట్ చిత్రాలు రావడం వల్లే నిర్మాత రిస్క్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

వచ్చేందుకు రెడీగా ఉన్న బాలయ్య

వచ్చేందుకు రెడీగా ఉన్న బాలయ్య

ప్రస్తుతం బాలకృష్ణ.. కేఎస్ రవికుమార్‌తో కలిసి చేసిన ‘రూలర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌పై బాలయ్య దృష్టి సారిస్తున్నారు. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X