Anushka Shetty వయసులో తనకంటే చిన్నవాడితో అనుష్క శెట్టి పెళ్లి? వర్కవుట్ అవుతుందా?
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. తన నటన, మాంచి కామెడీ టైమింగ్‌తో సినిమాలతో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఇద్దరు కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్కోని విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఓ విడీయోను విడుదల చేసింది. సినిమా ఎప్పుడు రిలీజ్‌కి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ చిత్రబృందం వినూత్నంగా ఓ వీడియోను విడుదల చేసింది. హీరో నవీన్, కమెడియన్ మహేష్ మధ్య సాగే సంభాషణలో సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. సెప్టెంబర్ 7న విడుదల చేస్తున్నట్టు వీడియోలో స్పష్టం చేశారు.

పనులన్నీ పూర్తి: వాస్తవానికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీని ఆగస్టు 4న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ నోట్ విడుదల చేసింది. తదుపరి డేట్‌పై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేస్కోని థియేటర్లలో విడుదల చేయాడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వీడియోలో స్పష్టం చేశారు.

ఐదేళ్లుగా కనిపించని స్వీటీ: ఐదు సంవత్సరాల తర్వాత అనుష్క(స్వీటీ) వెండితెర మీద కనిపించబోతున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా క్రేజ్ తెచ్చుకున్నారు అనుష్క. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో దేవసేన పాత్రలో ప్రేక్షకుల మనసు దోచుకున్నారామె. ఆమె చివరిసారిగా నిశ్శబ్దంలో నటించింది.
కానీ అది ఓటీటీలో మాత్రమే విడుదలైంది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులు చివరిసారిగా భాగమతిలోనే చూశారు. అప్పటి నుంచి ఆమె ఏ చిత్రంలో నటించలేదు. ఎందుకంటే ఇకపై సినిమాల్లో నటించకూడదనే నిర్ణయం తీస్కున్నట్టు, బరువు తగ్గడానికి గ్యాప్ తీస్కున్నట్టు పుకార్లు వచ్చాయి. కానీ, ఇవన్నీటిని కొట్టేస్తూ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నిటించింది.

యూత్‌లో నవీన్ క్రేజే వేరు: ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపర్చుకుంటూ తనదైన నటనాశైలితో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు నవీన్ పొలిశెట్టి. జాతిరత్నాలు సినిమాలో నవీన్ యాక్టింగ్, కామెడీ యూత్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్న చిత్రం ఇదే. అనుష్క వంటి స్టార్ హీరోయిన్‌తో నటిస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

చెఫ్, స్టాండప్ కమెడియన కథ: ఈ సినిమాలో అనుష్క ప్రొఫెషనల్ చెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నారు. ఇంతకుమందు రిలీజ్ చేసిన టీజర్‌లో హీరోహీరోయిన్ క్యారెక్టర్‌లను పరిచయం చేశారు. చాలా హాస్యభరితంగా ఉన్నట్టు స్పష్టమైంది. అనుష్క పెళ్లి చేస్కోకూడదని నిర్ణయించుకుంటుంది. ఆమెకు ఫ్యామిలీ అంత సపోర్ట్‌గా ఉంటుంది.
పేరెంట్స్‌కు ఇష్టం లేకపోయిన స్టాండప్ కమెడియన్‌గా ప్రయత్నిస్తుంటాడు హీరో. వీళ్ల జర్నీలో అనుకోకుండా పరిచయం అవుతారు. పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. తన కంటే వయసులో చిన్నవాడైనా పొలిశెట్టితో ప్రేమ పెళ్లిగా మారిందా? వారిద్దరి ప్రేమకు ముగింపు ఏమిటి? చివరికి ఏం జరిగిందనేది ఆగస్టు 7న థియేటర్లలో చూడాల్సిందే. అయితే ఈ సినిమా కథ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











