Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Miss Universe 2021: ప్రతిభ చాటుకొన్న హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్.. మిస్ ఇండియాను అలాంటి చీరకట్టులో..
మిస్ యూనివర్స్ 2021లో హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ తన ప్రతిభను చాటుకొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న మిస్ ఇండియా ఆడ్లైన్ క్యాస్టెలినోకు ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యహరించారు.
అందాల పోటీల్లో భాగంగా నిర్వహించిన నేషనల్ క్యాస్టూమ్ రౌండ్‌లో ఆరు అడుగుల చీరతో మిస్ ఇండియా ఆడ్లైన్‌ను అందంగా ముస్తాబు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. జాతీయ పుష్పం లోటస్‌ను స్పూర్తి పొందిన ఆయన ఈ రౌండ్‌లో మిస్ ఇండియా ఆడ్లైన్ అందరి దృష్టిలో పడేలా చేశారు. నేషనల్ క్యాస్టూమ్ రౌండ్‌లో భారత్‌కు మంచి ఆదరణ దక్కింది.

ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ 1976 మే 2వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. వాస్తవానికి వైద్య విద్యను అభ్యసించారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఉండటంతో హైదరాబాద్‌లోని నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీని సాధించారు. ఆ తర్వాత లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి కలర్ సైకాలజీలో స్పెషలైజేషన్ సాధించారు. హైదరాబాద్‌లో శ్రవణ్స్ స్టూడియోను ప్రారంభించారు. అలాగే ఆలయం సోసైటీని 2015 మొదలుపెట్టారు. హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ వస్త్రాల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్లా ప్రాంతాల్లోని చేనేత వస్త్రాలకు ప్రజాదరణ పొందేలా కృషి చేస్తున్నారు.

మిస్ యూనివర్స్‌గా మిస్ మెక్సికో ఆండ్రియా.. సత్తా చాటిన భారతీయ అందాల సుందరి
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపుతో తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లోని చేనేత వస్త్రాలతో అనేక డిజైన్లు తయారు చేస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ లాంటి దేశాల్లో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనింగ్ పోటీల వేదికలపై హ్యాండ్లూమ్స్, పవర్‌లూమ్స్ ఉత్పత్తులకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు.