Miss Universe 2021 Runner-Up: మిస్ యూనివర్స్ పోటీలో సత్తా చాటిన అడ్లైన్.. మిస్ ఇండియా ఎక్కడ పుట్టారో తెలుసా?

విశ్వ సుందరి 2021 పోటీల్లో మిస్ ఇండియా ఆడెలైన్ క్యాస్టెలినో దేశం తరపున సత్తా చాటారు. దాదాపు 75 దేశాలు పాల్గొన్న అందాల పోటీల్లో భారత్ తరపున నాలుగో స్థానంలో నిలిచారు. మిస్ యూనివర్స్‌గా మెక్సికోకు చెందిన ఆండ్రియా ఎంపిక కగా, సెకండ్ రన్నరప్‌గా మిస్ బ్రెజిల్ జూలియా గామా, మూడో రన్నరగా మిస్ పెరు జానిక్ మాసెటా డెల్ క్యాస్టిల్లో నిలిచారు.

అడ్లైన్ క్యాస్టెలినో 1998 జూలై 24వ తేదీన కువైట్ సిటీలో జన్మించారు. ఆమె అసలు పేరు అడ్లైన్ మెవీస్ క్వాడ్రోస్ క్యాస్టెలినో. ముంబైలోని విల్సన్ కాలేజ్‌ నుంచి ఎంబీఏ పట్టాను అందుకొన్నారు. ఆమె ఎత్తు ఐదు అడుగుల 6 అంగుళాలు. కర్ణాటకలోని ఉడిపి పరిసర ప్రాంతంలోని ఉడ్యవారా ప్రాంతానికి చెందిన కుటుంబం నుంచి వచ్చారు. మేరే దిల్ విచ్, తేరా బినా అనే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించారు.

మిస్ యూనివర్స్ పోటీల కంటే ముందు.. ఆడ్లైన్ క్యాస్టెలినో మిస్ దివ యూనివర్స్ 2020ను గెలుచుకొన్నారు. మిస్ యూనివర్స్ పోటీల్లో నాలుగోస్థానంలో నిలిచిన తర్వాత ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు.

Miss Universe 2021 Andrea Meza Photos

Miss Universe 2021: Miss India Adline Castelino declared the third runer-up

ఆడ్లైన్ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ప్రపంచమంతా హర్షిస్తుంటే నాలో కలిగిన ఫీలింగ్స్ మీతో పంచుకోవాలని నిర్ణయించుకొన్నాను. నాకు అరుదైన గౌరవం దక్కిన సమయంలో భారతీయ జెండాలు రెపరెపలాడిన క్షణాలను మాటల్లో చెప్పలేను. ఆ అద్భుతం నా కళ్ల ముందు ఆవిష్కరించింది. దేశంలో నెలకొన్న పరిస్థితుల ఒక్కసారిగా కళ్లముందు కనపడ్డాయి. చిన్న వయసులో రకరకాల భావోద్వేగాలు నాలో కలిగాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని విశ్వసిస్తున్నాను అంటూ ఆడ్లైన్ క్యాస్టెలినో పేర్కొన్నారు.

అడ్లైన్ విషయానికి వస్తే.. గతేడాది కోవిడ్ 19 పరిస్థితుల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ కోసం నిధులను సేకరించేందుకు కృషి చేశారు. రోజువారీ కూలీలకు, వలస కార్మికులకు, ఇతర బాధితులనకు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను అందించే కార్యక్రమంలో భాగమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X