Miss Universe 2021 Winner: విశ్వసుందరిగా అండ్రియా మేజా.. భారతీయ అందాల సుందరికి ఏ స్థానం అంటే!
మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఫ్లోరిడాలోని సిమినోల్ హార్డ్ రాక్ హోటల్ అండ్ కాసినో హాలీవుడ్‌లో ఘనంగా ముగిసాయి. ఈ పోటీలలతో మిస్ మెక్సికో అండ్రియా మేజా విశ్వసుందరి టైటిల్‌ను సొంతం చేసుకొన్నారు. దాదాపు 73 దేశాలకు చెందిన అందాల భామల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని ఆండ్రియా టైటిల్‌ను ఎగిరేసుకుపోయారు.
విశ్వసుందరిగా నిలిచిన ఆండ్రియాకు మాజీ మిస్ యూనివర్స్, సౌతాఫ్రికాకు చెందిన జోజిబిని తుంజి అభినందనలు తెలిపి కిరిటాన్ని తలపై ఉంచింది. ఈ సందర్భంగా తోటి కంటెస్టెంట్లు, నిర్వాహకులు, అతిథుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

మెక్సికో దేశం నుంచి మూడో విశ్వసుందరిగా ఆండ్రియా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. గతంలో అంటే 1991లో లుపిటా జోన్స్, 2010లో జిమెనా నవర్రెటే విశ్వసుందరిలుగా నిలిచారు.
ఈ అందాల పోటీలలో ఫస్ట్ రన్నరప్‌గా మిస్ బ్రెజిల్ జులియా గామా, రెండో రన్నరప్‌గా మిస్ పెరూ జానిక్ మాకెటా డెల్ కాస్టిల్లో నిలిచారు. విశ్వసుందరి 2021 అందాల పోటీలో భారత్‌కు చెందిన అడ్లైన్ క్యాస్ట్‌లినో మూడో రన్నరప్‌గా నిలవడం విశేషంగా మారింది.
2021 విశ్వసుందరి అందాల పోటీలకు అమెరికా తార మారియో లోపేజ్, టెలివిజన్ హోస్ట్ ఒలివియా కల్పో హోస్టులుగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











