ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ‘మిఠాయి’ రిలీజ్ డేట్ ఖరారు

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'మిఠాయి'. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.

Mithai is all set for release on February 22

డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టెనర్‌‌పై ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అంచనాలు పెరిగాయి. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెడ్‌ యాంట్స్‌ బ్యానర్‌పై ప్రభాత్‌ కుమార్‌ నిర్మించగా, వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చారు.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పలు సినిమాల్లో తమ కమెడీ పాత్రలతో అలరించారు. ఇపుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ నవ్వించడంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.

'మిఠాయి' చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రోజు బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'ఎన్టీఆర్-మహానాయకుడు' విడుదలవుతోంది. చిత్రానికి కెమెరా: రవివర్మ నీలమేఘం, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: గారీ బిహెచ్, నిర్మాణ సంస్థ: రెడ్ యాంట్స్, నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్, దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X