For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Radhe Shyam మూవీ నుంచి ఊహించని న్యూస్: కృష్ణంరాజు పాత్రలో మరో స్టార్

  |

  కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతేకాదు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తద్వారా తన మార్కెట్‌ను దేశ వ్యాప్తంగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడీ స్టార్.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'రాధే శ్యామ్'. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక, సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో గ్రీన్ మ్యాట్ సీన్స్ (గ్రాఫిక్) ఎక్కువగా ఉండడంతో దీనికి చాలా సమయం పడుతుందనే టాక్ వినిపిస్తోంది.

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. తెలుగులోనే కాదు.. మిగిలిన భాషలు అన్నింట్లోనూ ఈ సినిమాకు సంబంధించిన వివరాలను రివీల్ చేయడానికి కొన్ని పోస్టర్లను కూడా వదలబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  Seetimaarr Day 1 collections: చరిత్ర సృష్టించిన గోపీచంద్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డ్

  Mithun Chakraborty Replace Krishnam Raju in Prabhass Radhe Shyam

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కేవలం తెలుగులో మాత్రమే ఉంటుందట. మిగిలిన భాషల్లో ఆయా పరిశ్రమలకు చెందిన సీనియర్ నటులను తీసుకున్నారని అంటున్నారు. ఇక, హిందీ విషయానికి వస్తే.. ఈ పాత్రను అందులో బాలీవుడ్‌కు చెందిన మిథున్ చక్రవర్తి పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్లు రాబోతున్నాయట.

  పాన్ ఇండియా రేంజ్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తోన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

  English summary
  Rebel Star Prabhas upcoming film is Radhe Shyam Under Radha Krishna Kumar Direction. Mithun Chakraborty Replace Krishnam Raju in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X