Simha Koduri: తండ్రి కీరవాణితో సింహ కోడూరి గొడవలు.. అందుకే ఇంటి పేరు మార్చుకున్నానంటూ!

సింహా కోడూరి.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కొడుకుగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన హీరోగా కూడా మారి సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తండ్రి కీరవాణితో తనకు ఉన్న గొడవలపై స్పందించారు. ముఖ్యంగా తాను ఇంటి పేరు మార్చుకోవడానికి గల కారాణాలను తొలిసారి వివరించారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2007లో యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన ఈయన ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాలో కూడా ఓబులేశుగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఈగలో సమంత స్నేహితుడిగా కనిపించి మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత మత్త వదులరా సినిమాతో హీరోగా మారిపోయాడు. ఇక మూడేళ్ల క్రితం అయితే తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భఆగ్ సాలే, ఉస్తాద్ వంటి సినిమాలు చేసి మెప్పించాడు. ఇప్పటి వరకు 5 చిత్రాల్లో హీరోగా చేసిన ఈయనకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

MM Keeravani Son Simha Koduri Clarrity on The Quarrels With Father Check Details

అయినప్పటికీ కెరియర్ లో ముందుకు సాగుతూనే ఉన్నాడీ కుర్రహీరో. ప్రస్తుతం 28 ఏళ్ల వయసు కల్గిన ఈయన తాజాగా ఓ షోకు వచ్చాడు. రీతూ చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ షోలో పాల్గొన్నాడు. అక్కడే తన గురించి అనేక విషయాలు చెప్పాడు. ముఖ్యంగా యాంకర్ రీతూ చౌదరి నీకు మీ నాన్న ఎంఎం కీరవాణికి చాలా గొడవలు ఉన్నాయని తెలిసింది మాకు అంటూ చెప్పుకొచ్చింది. అది విన్న సంహా కోడూరి అవునా.. అలాంటిదేమీ లేదే అన్నాడు. లేదు మాకు తెలిసింది... మీరు పేరు కూడా మార్చుకున్నారట కదా అంటూ ప్రశ్నించింది రీతూ చౌదరి.

ఇందుకు స్పందించిన శ్రీ సింహా కోడూరి.. నాకు మా నాన్నకు ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. అలాగే తన అసలు ఇంటి పేరు కోడూరి అని.. అయితే తన తండ్రి వల్ల ఎం ఎం అని వచ్చిందని చెప్పుకొచ్చాడు. తాను కూడా ఎం.ఎం శ్రీ సింహా కోడూరిగానే కొనసాగుతున్నానని.. కానీ ఎం.ఎం గురించి తెలియక చిన్నప్పటి నుంచి ఇంటి పేరును మాత్రమే తన సర్టిఫికేట్లలో రాసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చానని క్లారిటీ ఇచ్చాడు.

కానీ ఈ విషయం తెలియని చాలా మంది తమకు తాముగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు ఉన్నాయంటూ కథలు రాసుకొచ్చారని అన్నారు. దాని వల్ల కూడా చాలా మంది తనకు తన తండ్రితో గొడవలు ఉన్నాయని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తనకు తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని.. తల్లిదండ్రులతో చాలా క్లోజ్ గా ఉంటానని వివరించాడు శ్రీసింహ కోడూరి. అలాగే ముందు ముందు మంచి మంచి సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X