twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరుదైన వ్యాధి గురించి కీరవాణి షాకింగ్‌ విషయాలు.. అవగాహన కల్పించాలని వేడుకోలు..

    |

    ప్రస్తుతం అందరూ కరోనాకు భయపడుతున్నారు. ఎక్కడ తిరిగే ఎలా వస్తుందో అని అందరూ ఇంటి పట్టునే కూర్చుంటారు. అయినా సరే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవుతోంది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న ఎం ఎం కీరవాణి ప్లాస్మా దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. కరోనా నుంచి పూర్తిగానే కోలుకున్నాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో కీరవాణి మరో అరుదైన వ్యాధి గురించి చెబుతూ వీడియో పెట్టడంతో మీడియాలో రూమర్లు జోరందుకొన్నాయి.

    ఈ మేరకు కీరవాణి ఓ వీడియోన విడుదల చేశాడు. 'మల్టిపుల్‌ సెలిరోసిస్ వ్యాధి గురించి తెలిసింది. గత కొన్ని రోజులుగా ఆ వ్యాధి గురించి తెలుసుకొంటున్నాను. ఈ వ్యాధి ఎవరికైనా, ఎప్పుడైనా ఏ వయసువారికైనా రావచ్చు. ఈ మల్టీ పుల్ సిర్రోసిస్ వల్ల మెదడు, శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతింటుంది. ఆ కనెక్షన్ పోతుంది అని వీడియోలో తెలిపారు.

     MM Keeravani Suffering With Multiple sclerosis

    మల్టీపుల్ సెలిరోసిస్ సోసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థతో ఎంతో కృషి చేస్తోంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారంతా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలి. ప్రభుత్వాలు కూడా వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం‌ వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చు' అని తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యాధి గురించి, ఆ సొసైటీ గురించి విద్యాబాలన్ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, క్రిష్ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నానని తాజాగా వెల్లడించాడు.

    అయితే మల్టీపుల్ సెలిరోసిస్ వ్యాధి గురించి వీడియో రిలీజ్ చేయడంతో కీరవాణి ఆ వ్యాధితో బాధపడుతున్నారనే రూమర్లు సోషల్ మీడియా, వెబ్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వ్యాధికి తాను గురయ్యారనే విషయంపై క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్లకు బ్రేక్ పడే అవకాశం లేదంటున్నాయి సినీ వర్గాలు.

    English summary
    MM Keeravani Suffering With Multiple sclerosis, Now he Released A Video Sharing That It CanHappen To Any Body.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X