మోహన్ బాబు 60 ఫీట్ల కటౌట్.. తుక్కుతుక్కు చింపేశారు.. ఎందుకంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90లో మంచు మోహన్ బాబు హీరోగా, విలన్ గా చాలా సినిమాలు చేశారు. ఆయన నటనకు విశేషమైన ప్రేక్షకాదరణ దక్కింది. దాంతో డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ అనే బిరుదులు కూడా వచ్చాయి. ఎన్నో సోషల్ ఎక్స్పీరమెంట్ చిత్రాల్లో నటించి, నిర్మించి టాలీవుడ్ చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్థానం దక్కింది.

కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..
మంచు మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా, విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుద్దుకున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబే నిర్మిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా మేకర్స్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా కన్నప్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 7న గుంటూరు లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ కు లోకల్ పొలిటికల్ లీడర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Mohan Babu about his 60 feet Cutout Controversy

మోహన్ బాబు 60 ఫీట్ కటౌట్ కాంట్రవర్సీ..
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గుంటూరులో గ్రాండ్ గా ఏర్పాట్లు నిర్వహించారు. ఈవెంట్ కు ఆ చిత్రంలో నటించిన, పనిచేసిన ప్రభు దేవా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ వంటి వారు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంచు మోహన్ బాబు ఆసక్తికరంగా ప్రసంగించారు. సినిమా గురించి పలు విషయాలు చెప్పిన తర్వాత.. గుంటూరు లో తనకు జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నారు. అందుకు కారణమైన వ్యక్తిని కూడా అందరికీ చూపించారు.

'1991లో నేను నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం సమయంలో గుంటూరు లో ఓ ఘటన జరిగింది. ఇక్కడే జూన్ 4న అసెంబ్లీ రౌడీ సినిమా విడుదలైంది. అయితే అసెంబ్లీ రౌడీ సినిమాలోని స్టిల్ కు సంబంధించిన 60 ఫీట్ల నా కటౌట్ ను థియటర్ లో ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ ను ఓ కాంగ్రెస్ నాయకుడు తగలబెట్టేశాడు ఓ నాయకుడు. అతను మరెవరో కాదు.. ఇక్కడే ఉన్న వెంట్రావ్.. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడంతో సమస్య సర్దుమణిగింది.' అని చెప్పుకొచ్చారు. ఇక మోహన్ బాబు కెరీయర్ లో గృహ ప్రవేశం, పెద్ద రాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు, సింహా బాలుడు, నాయుడు బావ, రావణుడే రాముడైతే, ధర్మపోరాటం, పద్మవ్యూహం వంటి చిత్రాలతో దుమ్ములేపారు. ఆయన కెరీయల్ లో 500కుపైగా సినిమాల్లో నటించారు. 100 సినిమాలకు ప్రొడ్యూస్ చేయడం విశేషం.

కన్నప్పతో మంచు మోహన్ బాబు సాహసం..
మోహన్ బాబు 'కన్నప్ప' చిత్రానికి రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇప్పటికే ఇల్లు తాకట్టు పెట్టామని, బ్యాంక్ లో లోన్ కూడా తీసుకున్నామని మంచు విష్ణు చెప్పారు. ఈ క్రమంలో సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొడితే మోహన్ బాబు భారీ నష్టం తప్పదని అంటున్నారు. కానీ 'కన్నప్ప' చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందీ చిత్రం. ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X