For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MBU: మోహన్ బాబు సంచలన ప్రకటన.. మద్దతిస్తారని ఆశిస్తున్నానంటూ ట్వీట్

  |

  చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. విలన్‌గా మొదలైన ఆయన నట ప్రస్థానం ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా పలు రకాలుగా కొనసాగింది. ఈ క్రమంలోనే సుదీర్ఘ ప్రయాణంలో ఆయన దాదాపు 500లకు పైగానే చిత్రాల్లో నటించారు. అయితే, కొంత కాలంగా సినిమా వేగం తగ్గించారు. దీంతో చాలా తక్కువ మూవీల్లోనే నటిస్తున్నారు. కానీ, సేవా కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలను చేస్తూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా మందికి అండగా నిలుస్తున్నారు.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  హీరోగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే మోహన్ బాబు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్‌ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కడ విద్యను అందిస్తూ విద్యావేత్తగా మారిపోయారు. ఈ క్రమంలోనే తన ద్వారా విస్తృతమైన సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో మోహన్ బాబు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే తాజాగా త్వరలోనే 'మోహన్ బాబు యూనివర్శిటీ'ని ప్రారంభిస్తున్నట్లు తాజాగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆయన యూనివర్శిటీకి సంబంధించిన లోగోను కూడా విడుదల చేశారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

  Mohan Babu Announce His MB University

  తాజాగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో 'ఎమ్‌బీయూ' లోగోను ఆవిష్కరించారు. దీనితో పాటు ఓ ప్రకటనను కూడా వదిలారు. అందులో 'శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ యూనివర్శిటీకి సంబంధించిన సేవలు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి' అని వెల్లడించారు.

  దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

  ఇక, మోహన్ బాబు యూనివర్శిటీ ప్రకటనకు ముందే ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు 'నాన్న ఓ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారు' అని ట్వీట్ చేశాడు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు మోహన్ బాబు ఇప్పుడు యూనివర్శిటీకి సంబంధించిన ప్రకటన చేశారు. ఇక, కలెక్షన్ కింగ్ చేసిన ప్రకటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నిజమైన విద్యావేత్త అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.

  Mohan Babu Announce His MB University

  ఇదిలా ఉండగా.. సుదీర్ఘ విరామం తర్వాత కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు లీడ్ రోల్‌ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. కొద్ది రోజుల క్రితమే విడుదలైన టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Senior Hero Mohan Babu announced that Sree Vidyanikethan turned out into Mohan Babu University Located in Tirupati.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X