ఇదే మాకు పెద్ద పండగ.. దీని కోసమే ఎదురుచూస్తూ ఉంటాం.. మంచు మనోజ్ కామెంట్స్

మంచు మోహన్ బాబు.. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడు ఈ డైలాగ్ కింగ్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి.. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగల సమర్థుడనని నిరూపించుకున్నారాయన. మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్న ఆయన పుట్టిన రోజు ఈ రోజు (మార్చి 19). ఈ సందర్భంగా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు మంచు మనోజ్. వివరాల్లోకి పోతే..

తండ్రిపై అపారమైన ప్రేమ.. మంచు మనోజ్ ట్వీట్

''సంవత్సరంలో ఎన్ని పండుగలున్నా ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న'' అంటూ మంచు మనోజ్ విష్ చేశారు. మనోజ్‌కి తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమను తేలియాజేసేలా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

వెల్లువెత్తుతున్న విషెస్.. సినీ, రాజకీయ ప్రముఖులు

మంచు మనోజ్ చేసిన ట్వీట్ చూసి.. అశేష అభిమాన లోకం మోహన్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు.

మోహన్ బాబు జననం.. విద్యాబ్యాసం

మోహన్ బాబు జననం.. విద్యాబ్యాసం

మార్చి 19వ తేదీ 1952 వ సంవత్పరంలో జన్మించారు మోహన్ బాబు. చిత్తూరు జిల్లా.. ఏర్పేడు మండలం మోదుగులపాలెం గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయుడు. భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేసిన ఆయన.. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేశారు.

స్వర్గం నరకం.. దాసరి శిష్యుడిగా

స్వర్గం నరకం.. దాసరి శిష్యుడిగా

స్వర్గం నరకం సినిమాతో 1975 సంవత్సరంలో తెలుగు తెరకు పరిచయమైన మోహన్ బాబు అలుపెరగని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ జర్నీలో మరే ఇతర నటుడు పోషించనన్ని విలక్షణ పాత్రలు పోషించారు. సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా పేరు మార్చుకున్న ఆయన.. దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా ప్రశంసలందుకున్నారు.

మోహ‌న్ బాబు క‌నిపించాల్సిందే..

మోహ‌న్ బాబు క‌నిపించాల్సిందే..

ఎన‌భైల్లోఏ సినిమా విడుద‌లైనా కూడా అందులో మోహ‌న్ బాబు క‌నిపించాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభ‌న్ బాబు, కృష్ణ‌, కృష్ణంరాజు నుంచి చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున‌, వెంక‌టేష్ వ‌ర‌కు అంద‌రితోనూ క‌లిసి న‌టించాడు మోహ‌న్ బాబు. ఇకపోతే నటుడిగానే గాక నిర్మాతగా కూడా సక్సెస్ అయిన మోహన్ బాబు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను రూపొందించారు.

Recommended Video

Anukunnadi Okati Ayinadi Okati : Dhanya Balakrishna, Siddhi Idnani Request To Audience
బర్త్ డే వేడుకలు క్యాన్సిల్

బర్త్ డే వేడుకలు క్యాన్సిల్

ప్రతి యేటా మార్చి 19వ తేదీన తన జన్మదినోత్సవంతో పాటు శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని కూడా జరుపుతుంటారు మోహన్ బాబు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ భయాందోళనల కారణంగా వాటిని వాయిదా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X