కన్నప్పకు తుడరం కంటే ఒక్క రూపాయైనా ఎక్కువ.. మోహన్‌లాల్‌కు మోహన్ బాబు ఛాలెంజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీయర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు సాధించుకున్న మోహన్ బాబు ఎన్నో అవార్డు, ప్రశంసలు అందుకున్నారు. అన్ని రకాల చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు నిర్మించిన 'కన్నప్ప' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మోహన్ లాల్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ చిత్రంతో కన్నప్ప సినిమా వసూళ్లను అంచనా వేస్తూ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రం..
మోహన్ బాబు ఆయన కెరీయర్ లోనే అత్యధిక బడ్జెట్ తో 'కన్నప్ప' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఈ సినిమాకు ఖర్చు చేయడం విశేషం. ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. మరోవైపు ఈ చిత్రం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కావడం విశేషం. దీంతో భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లతో సినిమాను నిర్మించేందుకు పూనుకున్నారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు కన్నప్ప మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం.

Mohan Babu Challange to Mohanlal

మోహన్ లాల్ కు మోహన్ బాబు సవాల్..
మంచు మోహన్ బాబు కన్నప్ప రిలీజ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సౌత్, నార్త్ లో జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేరళలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు ఆసక్తికరంగా మాట్లాడారు. మోహన్ లాల్ తమ సినిమాలో చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కన్నప్ప చిత్రం కేరళలో బాగా ఆడాలని కోరుకున్నారు. ఇదే సమయంలో మోహన్ లాల్ కు షాకిచ్చేలా మాట్లాడారు.కన్నప్ప చిత్రం మోహన్ లాల్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ 'తుడరుమ్' చిత్రం కంటే ఒక్క రూపాయి ఎక్కువ సంపాదించిన చాలు అని వ్యాఖ్యానించారు. కన్నప్ప చిత్రం కలెక్షన్లను తుడరుమ్ బాక్సాఫీస్ వసూళ్లతో పోల్చడం హాట్ టాపిక్ గ్గా మారింది.

తుడరుమ్ బాక్సాఫీస్ వసూళ్లు..
ఎల్2 : ఎంపురాన్ చిత్రం తర్వాత మోహన్ లాల్ 'తుడరుమ్' అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. రూ.28 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.237 కోట్ల గ్రాస్ వసూల్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా చాలా రికార్డులను సెట్ చేసింది.

కన్నప్పపై భారీ అంచనాలు..
కన్నప్ప చిత్ర ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్ర పోషిస్తుండటంతో భారీ అంచనాలు నెలకున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో ఇంకా హైప్ పెరిగింది. దీంతో ఈ చిత్రం ఓపెనింగ్ డే బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: mohan babu mohanlal kannappa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X