పబ్లిక్‌గా మోహన్ బాబుకు చిరంజీవి కిస్.. మంచు మనోజ్, విష్ణు రియాక్షన్ చూడండి ఎలా ఉందో!
మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. ఈ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులు పైగా దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీలు. అయితే ఓ వెదికపై ఈ ఇద్దరూ పబ్లిక్‌గా ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా దీనిపై మంచు వారబ్బాయిలు మనోజ్, విష్ణు రియాక్ట్ అయ్యారు. వివరాల్లోకి పోతే..

మా 2020 డైరీ ఆవిష్కరణ.. ప్రముఖుల హాజరు
గురువారం (జనవరి 2) హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్ సభ్యులతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు, జయసుధ, రాజశేఖర్, జీవిత, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

నవ్వులు పూయించిన మోహన్ బాబు
ఈ కార్యక్రమంలో 'మా' పై, అలాగే చిరంజీవి సలహాపై రాజశేఖర్ అసహనం వ్యక్తం చేయడంతో వేదిక రసాభాసగా మారింది. ఈ పరిస్థితి గుర్తించిన మోహన్ బాబు.. వేదిక మీద నవ్వులు పూయించేలా జోకులు వేశాడు. వేదిక మీద ఉన్న పెద్దలకు స్వాగతం పలుకుతూ కృష్ణంరాజును తాతగారు అని సంబోధించి వేదికపై ఉన్న పెద్దలను నవ్వించాడు.

ఆత్మీయంగా చిరంజీవి ఆలింగనం
ఇక ఆ తర్వాత చిరంజీవి గురించి మాట్లాడిన మోహన్ బాబు.. తామిద్దరం ఎప్పుడు కలుసుకున్నా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామే తప్ప.. తామిద్దరి మధ్య విభేదాల్లేవని అన్నారు. దీంతో చిరంజీవి, మోహన్ బాబును ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ముద్దులు పెట్టడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మంచు వారబ్బాయిలు.. మనోజ్ రియాక్షన్
ఈ ఫోటోలు, వీరిద్దరినీ ఇలా చూసిన మంచు వారబ్బాయిలు మనోజ్, విష్ణు స్పందిస్తూ ట్వీట్ చేశారు. వీళ్ళు సినీ అమ్మ ముద్దుబిడ్డలు అంటూ పేర్కొన్న మనోజ్, "2020 ఆరంభానికి ఇదే బెస్ట్ ఫొటో" అని పేర్కొంటూ ఆ ఫోటో ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టాడు.
వీళ్ళే నిజమైన గ్యాంగ్‌స్టర్స్..
ఇక మంచు విష్ణు ట్వీట్ చేస్తూ.. ''ఈ ఇద్దరు లెజెండ్స్ ఎంత కూల్‌గా కనిపిస్తున్నారు. అన్ని తరాల వాళ్లకు వీరు ప్రేరణ ఇచ్చారు. వీళ్ళే నిజమైన గ్యాంగ్‌స్టర్స్. తెలుగు చిత్రసీమలో వారిద్దరిదీ ప్రేమతో కూడిన అపురూమైన స్నేహం'' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











