Unstoppable With NBK: చిరు గురించి కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పిన మోహన్ బాబు

బాలకృష్ణ తో ఆహా ఓటీటీ అన్ స్టాప్ బుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి రోజున అన్ స్టాప్ బుల్ మొదటి ఎపిసోడ్ ని ఆహా గ్రాండ్ గా లాంచ్ చేసింది. బాలకృష్ణ హోస్ట్ గా మొదలైన ఆహా అన్ స్టాప్ బుల్ పై ప్రకటించిన నాటి నుంచే అందరిలో భారీ అంచనాలున్నాయి. మొదటి ఎపిసోడ్ లోని ఒక ఆసక్తికర ప్రశ్న బాలకృష్ణ సంధించగా దానికి మోహన్ బాబు ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

ముందు నుంచీ ఆసక్తి

ముందు నుంచీ ఆసక్తి

సినిమాల్లో తన స్టార్ డమ్ పక్కనపెట్టి బాలకృష్ణ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఒక టాక్ షో చేయడం, ఆ టాక్ షో కి సంబంధించిన అనేక కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా కనిపించడంతో ఒక్క దెబ్బకు సబ్ స్క్రైబర్స్ పెరిగి పోయారట.. అల్లు అరవింద్ కాంపౌండ్ లో బాలయ్య అనగానే ఈ షో మీద ఇంకా ఇంకా ఆసక్తి పెరిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. అదిగాక పండగపూట ఫ్యామిలీ అందరూ కలిసే విధంగా 11:20కి ఈ మొదటి ఎపిసోడ్ రిలీజ్ చేయడంతో మొదటి ఎపిసోడ్ మీద జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది.

చెడు అభిప్రాయం లేదు

చెడు అభిప్రాయం లేదు

మొట్ట మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి గెస్ట్లుగా హాజరుకాగా చిరంజీవి మీద నీ అసలు ఒపీనియన్ ఏమిటి అని ప్రశ్నించాడు బాలయ్య. అయితే ఈ ప్రశ్నకు మోహన్ బాబు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. తనకు చిరంజీవితో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెప్పుకొచ్చిన ఆయన చిరంజీవి మంచి నటుడు అద్భుతంగా డాన్స్ వేస్తాడు అని చెప్పుకొచ్చారు.. చిరంజీవితో నాకు పర్సనల్గా కూడా ఎలాంటి చెడు అభిప్రాయం లేదని ఆయన వెల్లడించారు.

తెలివిగా సమాధానం

తెలివిగా సమాధానం


తాను అల్లు రామలింగయ్య గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించానని ఒక రకంగా తనకు ఆయన బాబాయ్ లాంటి వారని ఆయన కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చిరంజీవి బాగుంటాడని చాలా తెలివిగా సమాధానం చెప్పారు. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో చిరంజీవి, ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలపగా మంచు విష్ణు పోటీలోకి దిగడం సంచలనంగా మారింది.

కోల్డ్ వార్ కూడా

కోల్డ్ వార్ కూడా

ఈ క్రమంలో మోహన్ బాబు చిరంజీవి మధ్య కోల్డ్ వార్ కూడా నడిచినట్టుగా బయటకు సంకేతాలు వచ్చాయి. చిరంజీవి నేరుగా స్పందించలేదు కానీ మోహన్ బాబు మంచు విష్ణు చిరంజీవి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక తన మందు అల‌వాటు గురించి కూడా మోహ‌న్‌ బాబు వెల్లడించారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
సారాయి తాగేవాడినని

సారాయి తాగేవాడినని

రాత్రి ఏడున్న‌ర త‌ర్వాత ఉన్న అల‌వాటు గురించి చెప్ప‌మ‌ని బాలకృష్ణ, మోహ‌న్‌ బాబుని అడిగారు. ఆ రోజుల్లో చేతిలో డ‌బ్బులు ఉండేవి కావన్న ఆయన చెన్నైలోని కోడంబాకం బ్రిడ్జి కింద ఉండే సారాయి దుకాణానికి ఓ స్నేహితుడితో వెళ్లి సారాయి తాగేవాడినని లేని రోజుల్లో సారాయి తాగాను.. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కాబ‌ట్టి విస్కీ తాగుతున్నానని తనకున్న మందు అలవాటు గురించి చెప్పారు మోహన్ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X