సైరా అనేసిన మోహన్ బాబు.. చిరంజీవిపై మంచు ఫ్యామిలీ కామెంట్స్
మెగాస్టార్ అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతూ సైరా నరసింహా రెడ్డి వెండితెరపైకి రాబోతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో సైరా షోస్ పడేయడంతో ఈ సినిమా స్టామినా ఏంటో తెలిసిపోయింది. మరికొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల వెండితెరలు సైరా నినాదంతో మారుమోగనున్నాయి. ఈ తరుణంలో సైరా నరసింహా రెడ్డి సినిమాపై మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

ఇద్దరూ సీనియర్ నటులు.. స్నేహం అంటే
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ సీనియర్ నటులే. ఎన్నో సినిమాల్లో కలిసి తెర పంచుకున్నారు. ఇక వీరి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకమైన వివరణ ఆవరసమే లేదు. స్నేహంగా ఉంటూనే ఒకరిపై ఒకరు మాటలతూటాలు పీల్చుకోవడం చూస్తుంటాం. సీరియస్‌గా తిట్టుకోరు, ఎప్పుడూ కలిసి ఉండరు. ఇదో వింత స్నేహం.

చిరంజీవి ఒకరిపై ఒకరు.. స్నేహభావం స్నేహభావమే
గతంలో కొన్ని పబ్లిక్ ఈవెంట్లలో కూడా మోహన్ బాబు, చిరంజీవి ఒకరిపై ఒకరు ఎత్తిచూపుకుంటూ మాట్లాడుకోవడం చూసాం. అయినప్పటికీ స్నేహభావం స్నేహభావమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ ఇద్దరూ. తాజాగా ఇప్పుడు తన స్నేహితుడు చిరంజీవిపై అద్భుతమైన కామెంట్ చేశాడు మోహన్ బాబు. సైరా సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ఆ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
'సైరా నరసింహా రెడ్డి'పై కామెంట్
''నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు మోహన్ బాబు.
మంచు విష్ణు, మనోజ్ కూడా
కేవలం మోహన్ బాబు మాత్రమే కాదు.. మంచు లక్ష్మి, మంచు మనోజ్ కూడా సైరా సినిమాపై కామెంట్స్ చేశారు. మోహన్ బాబు చేసిన ట్వీట్‌ని మంచు మనోజ్ రీ ట్వీట్ చేశాడు. అలాగే మంచు విష్ణు.. తెలుగు సీమ ఏకైన మెగాస్టార్ చిరంజీవికి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ పెట్టాడు. చూడాలి మరి ఈ ట్వీట్లపై చిరంజీవి ఎలా స్పందిస్తాడో!.

సైరా నరసింహా రెడ్డి.. ఓ రేంజ్ పాసిటివిటీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ పాసిటివిటీ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











