Mohan Babu Vs Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలో ఉద్రిక్తత.. నడిరోడ్డుపై ఫ్యామిలీ రచ్చ

Mohan Babu Vs Manoj: గత కొంతకాలంగా టాలీవుడ్ సీనియర్ హీరో నటుడు మోహన్ బాబు ఇంట్లో కలహాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తండ్రి కొడుకులు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లి మీడియాపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం, ఈ తరుణంలో మోహన్ బాబుపై కేసు నమోదు కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో అటు మోహన్ బాబు గానీ , తన కొడుకులు గాని సైలెంట్ గా ఉండడంతో ఈ వివాదం ముగిసిందని అందరూ భావించారు. కానీ తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

గత నెలలో నటుడు మోహన్ బాబు ఇంట్లో కలహాలు చోటుచేసుకున్నాయి. ఆస్తి పంపకాల విషయంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం చెలరేగినట్లు, ఈ తరుణంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పై కేసు నమోదు చేయగా.. కొడుకు పై మోహన్ బాబు మరో కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో మీడియా కవరేజ్ వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం కూడా అందరికీ దీంతో మోహన్ బాబు పై కేసు నమోదు అయింది మరోవైపు తండ్రి మోహన్ బాబుతో వివాదం తర్వాత సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Mohan babu family controversy Police depoloyed at mohan babu university in tirupati

మంచు ఫ్యామిలీ వివాదంలో తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. తిరుప‌తిలోని మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీ వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. మంచు మ‌నోజ్ తిరుపతికి చేరుకోవడంతో యూనివ‌ర్సిటీకి వ‌స్తున్నార‌నే స‌మాచారంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఈ యూనివ‌ర్సిటీలో మోహ‌న్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో ఏమైనా గొడ‌వ‌లు జరగవచ్చనే అనుమానంతో పోలీసులు యూనివ‌ర్సిటీ గేటు వ‌ద్ద వేచి ఉన్నారు.

మరోవైపు.. మంచు మ‌నోజ్ తన భార్య తో కలిసి హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బ‌య‌ల్దేరారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు యూనివ‌ర్సిటీ ప‌రిస‌రాల్లో ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. ఎలాంటి ఉద్రిక్తలు చోటుచేసుకోకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జ‌రుగుతుందో? అని అభిమానులు కంగారు పడుతున్నారు. కాగా, ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ గొడ‌వ‌లు తార‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X