twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పసుపులేటి రామారావు మృతి.. మోహన్ బాబు, నితిన్, రానా స్పందన

    |

    సీనియర్ సినీ జర్నలిస్ట్, పీఆర్‌ఓ పసుపులేటి రామారావు (70) మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాకైంది. సీనియర్ హీరోలైన చిరంజీవి దగ్గరి నుంచి నాని, నితిన్ వంటి యంగ్ హీరోల వరకు ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి గురైన ఆయన మంగళవారం (ఫిబ్రవరి 11) ఉదయం వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా నితిన్,మోహన్ బాబు, రానా వంటి వారు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

    తీవ్ర దిగ్భ్రాంతిలో..

    తీవ్ర దిగ్భ్రాంతిలో..

    పసుపులేటి రామారావు మృతిపై వరల్డ్ ఫేమస్ లవర్ టీమ్ మాట్లాడుతూ... ‘సీనియర్ సినీ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన లేని లోటు ఇటు చిత్ర పరిశ్రమకు, అటు సినీ జర్నలిజానికి తీరనిది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామ'ని పేర్కొంది.

    తెల్లటి దుస్తులు, భుజాన సంచి..

    తెల్లటి దుస్తులు, భుజాన సంచి..

    యంగ్ హీరో నితిన్ స్పందిస్తూ.. ‘నాలుగున్నర దశాబ్దాల పాటు సినీ జర్నలిజానికి పర్యాయపదంగా నిలిచిన పసుపులేటి రామారావు గారు మృతి చెందడం అత్యంత బాధాకరం.. ఎప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన సంచీతో కనిపించేవారు. నన్ను పలుమార్లు ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయన పెద్దవారైనా యువకుల్లోని ఉత్సాహం కనిపించేది. సినీ జర్నలిజానికి, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన మృతికి సంతాపం తెలూపుతూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన'ని అన్నాడు.

    ఓ తరాని మార్గదర్శకం..

    ఓ తరాని మార్గదర్శకం..

    మోహన్ బాబు స్పందిస్తూ.. ‘నాకు సన్నిహితుడైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పటుంచీ ఆయనతో నాకు స్నేహం ఉంది. మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్ కు వచ్చాక కూడా అదే సానిహిత్యం మా మధ్య కొనసాగింది. అప్పుడూ, ఇప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన కాటన్ సంచీ.. ఇదే ఆయన ఆహార్యం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎన్నోసార్లు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూల్లో తనకు కావాల్సిన ఎన్నో విషయాలు రాబట్టుకొనేవారు. సినిమా జర్నలిస్టుగా చిత్రసీమకు ఆయనెంతో సేవచేశారు. ఒక తరం సినీ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'నని అన్నాడు.

    దగ్గుబాటి కుటుంబం స్పందిస్తూ

    దగ్గుబాటి కుటుంబం స్పందిస్తూ


    దగ్గుబాటి కుటుంబం స్పందిస్తూ.. ‘సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు గారి ఆకస్మిక మృతి అత్యంత బాధాకరం. ఇండస్ట్రీలో ఆయన పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ జర్నలిజమే జీవితంగా బతికిన ఆయన మృతి జర్నలిస్టులకే కాకుండా యావత్ చిత్రసీమకూ తీరని లోటు. ఆయనతో మాకూ, మా సంస్థకూ ఎంతో అనుబంధం ఉంది. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబసభ్యులకు మా సానుభూతి ప్రకటిస్తున్నామ'ని సురేష్ బాబు, వెంకటేష్, రానా తెలిపారు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    ఫిలిం న్యూస్ క్యాస్టర్స్..

    ఫిలిం న్యూస్ క్యాస్టర్స్..

    పసుపులేటి రామారావు గారికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం తెలిసింది. ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ అయిన రాంబాబు, జలపతి, లక్ష్మీ నారాయణ, మా టీవీ రఘు, మాడూరి మధు తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.

    English summary
    Mohan Babu Rana And Nithiin Pays Tribute To Pasupuleti RamaRao. Chiranjeevi Pays Tribute To Pasupuleti RamaRao. Cine Pro, senior journalist Pasupuleti RamaRao paased away On 11th February. Cine celebrities Pays Deepest condolences to his death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X