లైఫ్ లో ఒకే ఒక్క కోరిక.. శివరాజ్ కుమార్ కు రిక్వెస్ట్ చేసిన మోహన్ బాబు
మంచు మోహన్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్దగా ఉన్నారు. అగ్ర నటుడిగా గుర్తింపు పొందారు. టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబుకు బిరుదులున్నాయి. 90లలో మోహన్ బాబు సినిమాలకు యయా క్రేజ్ ఉండేది. ఆయన కెరీయర్ లో దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన కెరీయర్ లో బిగ్ ప్రాజెక్ట్ ను తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. అయితే తాజాగా ఆ మూవీ ప్రమోషన్స్ లో మోహన్ బాబు మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.
మోహన్ బాబు సినీ ప్రస్థానం..
మంచు మోహన్ బాబు 40 ఏళ్ల అనుభవాన్ని సినీ పరిశ్రమలో పూర్తి చేసుకున్నారు. ఆయన డైలాగ్ లకు పెట్టింది పేరు. మోహన్ బాబు ఉన్నాడంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాల్సిందే. 1974 నుంచి మోహన్ బాబు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజు, స్వర్గం నరకం, భలే దొంగలు, అర్దాంగి, జీవన తీరాలు, శివరంజినీ, అల్లరి మొగుడు, పుణ్య భూమి నా దేశం, పెద్ద రాయుడు, అన్నమయ్య, రాయుడు, ఖైదీగారు, పోస్ట్ మెన్, రాయలసీమ రామన్న చౌదరి, అధిపతి వంటి చిత్రాలు మోహన్ బాబును ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర చేశాయి. ఇక విలన్ గా సపోర్టింగ్ రోల్స్ లో మోహన్ బాబు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు.

రూ.200 కోట్లతో సాహసం..
మంచు మోహన్ బాబు నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గానూ మొదటి నుంచి ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ వచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రానికి మోహన్ బాబే నిర్మాత గా వ్యవహరించారు. అంతకు ముందు, ఆ తర్వాత శ్రీ లక్ష్మి ప్రసన్న బ్యానర్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో పదుల సంఖ్యలో సినిమాలు నిర్మించారు. విష్ణు, రాజు బాయ్, దేనికైనా రెడీ, దూసుకెళ్తా వంటి చిత్రాలను చివరిగా ప్రొడ్యూస్ చేశారు. ఇక ప్రస్తుతం మునుపెప్పుడూ చేయనంత సాహసం 'కన్నప్ప' చిత్రంతో చేస్తున్నారు. ఏకంగా రూ.200 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 27న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని గ్రాండ్ ప్రమోట్ కూడా చేస్తున్నారు.
శివరాజ్ కుమర్ ను రిక్వెస్ట్ చేసిన వైనం..
కన్నప్ప చిత్రం ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా రిలీజ్ కు మూడు వారాల సమయమే ఉండటం, పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తుండటంతో ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కర్ఠాటకలో ప్రచారం చేశారు. భారీ సభను ఏర్పాటు చేసి శివరాజ్ కుమార్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సినిమా కంటే ముందే.. కన్నడ సీనియర్ నటులతో తనకు సంబంధాన్ని, ప్రెండ్షిప్ ను చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తనకు జీవితంలో ఒకే ఒక కోరిక ఉందని, అది ఒక్క కన్నడ చిత్రంలోనైనా నటించాలని ఉందని చెప్పారు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా అవ్వడం లేదని, ఇక శివ రాజ్ కుమార్ వచ్చే సినిమా తనకు విలన్ పాత్ర ఇవ్వాలని కోరారు. దీంతో శివరాజ్ కుమార్ కూడా సరేనన్నారు.
కన్నప్ప చిత్ర వివరాలు..
మైథాలజీ, ఫాంటసీ ఫిల్మ్ గా కన్నప్ప చిత్రం రూపుదిద్దుకుంటుంది. ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











