For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mohanbabu: మెల్లగా లాగావ్, సంతోషమే.. సమాధానం చెప్తా కానీ ముందు ఈ పని చెయ్ పవన్!

  |

  రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. నిన్న రాత్రి నుంచి ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయం మీద మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచు మోహన్ బాబుని కూడా ఉద్దేశిస్తూ మాట్లాడారు. తాజాగా ఈ అంశం మీద మోహన్ బాబు నోరు విప్పారు. పవన్ కామెంట్స్ గురించి ఆయన ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే

  ఒళ్ళు విరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు

  ఒళ్ళు విరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు

  నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన పవన్, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే.. అతను నటించిన సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ళ దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారని వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదు.. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదని అంటూ ఘాటు కామెంట్స్ చేశారు.

  జనాన్ని ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి, ఒళ్ళు విరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు వస్తున్నాయని అన్నారు. అలా కోట్లు పెట్టుబడితో సినిమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తానంటోంది.. కష్టం మేము పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా? అని కూడా పవన్ ప్రశ్నించారు.

  మూసుకు కూర్చోమని చెప్పలేరా

  మూసుకు కూర్చోమని చెప్పలేరా

  మన సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకుల్ని మూసుకు కూర్చోమని చెప్పలేరా.. ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పలేరా.. మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా? అని ప్రశ్నించిన పవన్ భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ అని అన్నారు. వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారని, అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారని అన్నారు.

  సినిమాల జోలికి రావొద్దని

  సినిమాల జోలికి రావొద్దని

  సినిమా వాళ్లు అంటే తైతక్కలు వేసేవాళ్లు అని మాట్లాడుతున్నారని, సినిమా తీయడం వెనుక ఎంతో కష్టం దాగి ఉందన్న పవన్ చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వానికి, కుల తత్వానికి స్థానం లేదని అన్నారు. ఏ పార్టీ సానుభూతిపరులు ఉన్నా మీకు అన్నంపెడుతున్న పరిశ్రమకు ముందు గౌరవం ఇవ్వండని అన్నారు. చిత్ర పరిశ్రమ జోలికి వస్తే అంతా ఏకమవ్వండి, నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి కానీ మిగతా వారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నానాని అన్నారు.

  మీ వాళ్లే కదా

  మీ వాళ్లే కదా

  ఇక మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదన్నా ఆయన సినిమా వాళ్ల కష్టాలపై మోహన్ బాబు మాట్లాడాలని అన్నారు. చిత్ర పరిశ్రమ గురించి మోహన్ బాబు వైసీపీ నేతలకు చెప్పాలని, ఇవే నిబంధనలు రేపు మోహన్ బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయని అన్నారు. మోహన్ బాబుకు జగన్ కు బంధుత్వం ఉందని విన్నానని, మీ వాళ్లే కదా.. ఏపీ ప్రభుత్వాధినేతతో సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలని అన్నారు.

  మెల్లగా లాగావ్, సంతోషమే

  మెల్లగా లాగావ్, సంతోషమే

  ఇక ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ మోహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు డియర్ పవన్ కళ్యాణ్ అంటూ సంబోధిస్తూ ఆయన ఒక లేఖ విడుదల చేశారు. నా చిరకాల మిత్రుడి సోదరుడు అయిన పవన్ కళ్యాణ్, నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏక వచనం తో సంభోదించాను'' అని మోహన్ బాబు అన్నారు. ''పవన్ కళ్యాణ్ గారు అనడం లో తప్పేమీ లేదు కానీ చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే.'' అని అన్నారు.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  ముందు మావాడికి ఒటేయ్యి

  ముందు మావాడికి ఒటేయ్యి

  '' ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10 వ తేదీన ఎలక్షన్లు అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడు అయిన విష్ణు బాబు కు, అతని ప్యానల్ కి వేసి వాళ్ళను గెలిపించాలని కోరుకుంటున్నాను.

  థాంక్యూ వెరీ మచ్, మోహన్ బాబు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కామెంట్స్ కు స్పందిస్తాను అని చెబుతూనే తన కొడుక్కి ఓటు వేయమని అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చాంశనీయం గా మారాయి.

  English summary
  Mohan babu responds on social media about pawan kalyan comments at repbulic movie pre relase event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X