twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన మోహన్ బాబు!

    |

    తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాలకు విద్యార్థులు బలైపోతున్నారు. తెలంగాణ ఇంటర్మీడియర్ ఫలితాల తర్వాత విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం పెను సంచలనంగా మారింది. తెలంగాణ ఇంటర్ బోర్డులో తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ ఘటనపై టాలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు.

    మోహన్ బాబు ఓ లేఖ ద్వారా స్పందిస్తూ భగవంతుడు జన్మనిచ్చింది చివరివరకూ జీవించడానికి. మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ఆత్మహత్యలు చేసుకుంటే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. తెలంగాణాలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఒక విద్యాసంస్థకు అధినేతగా నా మనసుని కలచివేసింది. ప్రభుత్వం స్పందించి తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోగా విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రుల హృదయాలకు శిక్ష విధించకండి అని ఓ లేఖ ద్వారా మోహన్ బాబు స్పందించారు.

    సినిమా వాళ్లు కేసీఆర్‌కు భయపడటం లేదు, ఆయన డిక్టేటర్ కాదు: మంచు విష్ణుసినిమా వాళ్లు కేసీఆర్‌కు భయపడటం లేదు, ఆయన డిక్టేటర్ కాదు: మంచు విష్ణు

    Mohan Babu responds on Telangana Inter students Suicides

    ఎన్నికలకు ముందు కూడా మోహన్ బాబు విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఎపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించాయి. తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలపై మారుతి, నాని, సాయిధరమ్ తేజ్, రామ్ లాంటి సినీప్రముఖులంతా స్పందించారు.

    English summary
    Mohan Babu responds on Telangana Inter students Suicides.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X