Unstoppable With NBK: ఇన్నేళ్ళ తరువాత బాలయ్యని ఇరికించిన మోహన్ బాబు.. ఆ అమ్మాయితో కారులో బాలకృష్ణ?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్ స్టాప్ బుల్ విత్ ఎన్.బి.కె అనే ఒక టాక్ షో వెలువడుతున్న సంగతి తెలిసిందే.. దీని మొదటి ఎపిసోడ్ దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి స్ట్రీమ్ అయ్యే విధంగా ఆహా దీపావళి కానుక అందించింది.. అలా వచ్చిన మొదటి ఎపిసోడ్ లో గెస్ట్ లుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి కనిపించారు.. మోహన్ బాబు సీక్రెట్స్ బాలయ్య రాబడతారు అనుకుంటే బాలయ్య సీక్రెట్స్ మోహన్ బాబు బయటపెట్టి ఆసక్తి రేకెత్తించారు. వివరాల్లోకి వెళితే

కొంప ముంచిన మోహన్ బాబు

కొంప ముంచిన మోహన్ బాబు

షోలో పాల్గొన్న మోహన్ బాబుతో ఒక ఆట ఆడిన బాలకృష్ణ ఓడిపోతే నేను అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలని కోరారు. అలాగే చెబుతానని మోహన్ బాబు మాటిచ్చాడు. అలా కొన్ని ప్రశ్నలు సంధించగా దానికి మోహన్ బాబు ఆసక్తికరంగానే సమాధానాలు ఇచ్చారు.. అలాగే తన మనస్తత్వం బాలకృష్ణ మనస్తత్వం ఒకటేనని ఇద్దరిదీ బోలా శంకరుడు లాగే లోపల ఏది పెట్టుకోకుండా మాట్లాడతామని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

బాలయ్య కారులో అమ్మాయి ఎవరు?

బాలయ్య కారులో అమ్మాయి ఎవరు?

అయితే మోహన్ బాబు ని బాలకృష్ణ ప్రశ్నలు అడిగితే బాలకృష్ణ అని కూడా మోహన్ బాబు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగానే ఆయన బాలకృష్ణ ని ఇరికించే విధంగా ఒక ప్రశ్న అడిగారు. మా ఇల్లు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది అలా వెళ్తున్న సమయంలో నా ముందు వెళుతున్న కార్ లో ఇద్దరు కనిపించారు. వెంటనే నేను డ్రైవర్ని ఆ కార్ ను ఓవర్ టెక్ చేసి కారుకు అడ్డంగా ఆపమని చెప్పాను. అందులో నువ్వు వేరే అమ్మాయి ఉన్నారు అవునా అని ప్రశ్నించారు.

 నిజమేనేని ఒప్పుకున్న బాలయ్య

నిజమేనేని ఒప్పుకున్న బాలయ్య

అవును నిజమే అని ఒప్పుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఆ అమ్మాయి పేరు అయితే చెప్పలేం అని చెప్పుకొచ్చారు. అయితే కుటుంబం నుంచి సంబంధించిన అమ్మాయి కాదు కదా అంటే అవును కుటుంబానికి సంబంధం లేని అమ్మాయి అని బాలకృష్ణ ఒప్పుకున్నారు. పైగా ఆయన మాట్లాడుతూ తాను ప్రజాప్రతినిధిని కాబట్టి ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్లి ఉండవచ్చు కదా అంటూ పరిస్థితిని కాస్త చల్లబరిచే ప్రయత్నం చేశారు.

 ఆసక్తి రేకెత్తించి చెప్పకుండా

ఆసక్తి రేకెత్తించి చెప్పకుండా

అలా ఎవరో అమ్మాయి అంటూనే ఆసక్తిని రేకెత్తించి ఆ పేరు చెప్పకుండా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నీరుగార్చే చేశారు. ఇక మంచు మోహన్ బాబు తో మాట్లాడుతూ ఉండగా మంచు విష్ణు, మంచు లక్ష్మి ఇద్దరినీ పిలిచి సర్ప్రైజ్ చేశాడు బాలకృష్ణ ఆ తర్వాత ముగ్గురు ప్రశ్నలడిగి ప్రేక్షకులను అలరించే విధంగా ప్రశ్నలు సంధించారు. మొత్తం మీద మొదటి ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అని చెప్పవచ్చు.

Recommended Video

1997 Movie Team Interview.. టాప్ టెకనీషియన్లు వర్క్ చేసిన చిత్రం
వన్ మ్యాన్ షో

వన్ మ్యాన్ షో

దాదాపు బాలకృష్ణను ఇష్టపడని వ్యక్తులు సైతం ఎపిసోడ్ చూసి ఇష్టపడుతారు అని ఆ చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ కూడా తనదైన ఉత్సాహంతో షో మొత్తాన్ని నడిపించారు. మునుపెన్నడూ చూడని బాలకృష్ణను ఆహా షోలో చూశారని మాత్రం చెప్పక తప్పదు. ఆయన షో మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఇక ఈ షో మిగతా ఎపిసోడ్స్ మీద కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది చూడాలి మరి ఎలా ఉంటాయో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X