Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Son of India Teaser: మోహన్ బాబు మూవీలో సర్ప్రైజ్ చేసిన చిరంజీవి
చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దాదాపు 500లకు పైగానే చిత్రాల్లో నటించిన ఆయన.. ఈ మధ్య వేగం తగ్గించారు. దీంతో చాలా తక్కువ మూవీల్లోనే నటిస్తున్నారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఆయన లీడ్ రోల్ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్ మొదలవుతుంది. ఇందులో 'మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సపరేటు.. తను ఎప్పుడు? ఎక్కడ? ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్లో ఎప్పుడు ఎలాంటి ఆలోచన పుడుతుందో ఏ న్యూమరాలజిస్టూ చెప్పలేడు' అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మోహన్ బాబు కూడా తనదైన శైలి డైలాగులతో రచ్చ రచ్చ చేశారు. చివర్లో 'నేను కసక్ అంటే.. మీరందరూ ఫసక్' అని చెప్పే డైలాగ్ మరింతగా ఆకట్టుకుంది.
ఇక, 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్లో మోహన్ బాబు ఎన్నో గెటప్‌లలో కనిపిస్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన రోజులను గుర్తు చేసేదిగా దర్శనమిచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇందులో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.