Son Of India Trailer : ప్రపంచం బాధే నా బాధ.. లా ఒకొక్కడికి ఒక్కోలా ఉంటే ఎలా?.. మోహన్ బాబు విశ్వరూపం
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సన్ ఆఫ్ ఇండియా". డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ని మేకర్స్ ఈ రోజు అంటే ఫిబ్రవరి 10న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈ సినిమా ట్రెయిలర్ ను చెప్పిన సమయానికి విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఫుల్ లెంగ్త్ రోల్ లో
నిజానికి మోహన్ బాబు ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. 2020లో సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు(తెలుగులో ఆకాశమే హద్దురా) అనే సినిమాలో నాయుడు అనే పాత్రలో నటించాడు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు.

ట్రైలర్ విడుదల
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన "సన్ ఆఫ్ ఇండియా" సినిమాలో డాక్టర్ మోహన్‌బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా భుజాన వేసుకున్నారు. ఫిబ్రవరి 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అంటే ఫిబ్రవరి 10న సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు.

ప్రపంచం బాధే నా బాధ
ఇక ట్రైలర్ లో మోహన్ బాబు రకరకాల గెటప్స్ లో కనిపించారు. ఇక ఎప్పటిలాగానే మోహన్ బాబు అదిరిపోయే డైలాగ్స్ చెప్పారు. ''ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది'', ''ప్రపంచమంతా నా కుటుంబం... ప్రపంచం బాధే నా బాధ'', స్వామి... ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... నేను దాన్నే ఫాలో అవుతున్నా'' వంటి డైలాగులు మోహన్ బాబు నోటా రావడం ఆసక్తికరంగా ఉంది.

లా ఒకొక్కడికి ఒక్కోలా ఉంటే ఎలా?
''ఇండియాలో అసలు న్యాయమే జరగదా, డబ్బున్నోడికి ఓ న్యాయం డబ్బులేనోడికి ఓ న్యాయం, పవర్ ఉన్నోడికి ఓ న్యాయం... పవర్ లేనోడికి ఓ న్యాయం... డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉంటే ఎలా?'', అయ్యోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నాను... ఈ సొసైటీలో చెత్త నా కొడుకులని, క్రిమినల్ నా కొడుకులని ఏరి పారేయాలి'', ''పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది'', ''నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం నీతో పాటు 135 కోట్ల ఇండియన్స్ కి చాలా డిటైల్డ్ గా చెబుతాను'' అంటూ సాగుతున్న డైలాగులు విపరీతంగా ఆకట్టుకున్న్నాయి.
Recommended Video
ఇళయరాజా సంగీతాన్ని
నిముషం 33 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ పవర్ ఫుల్ డైలాగ్స్, విజువల్స్ తో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక డా.మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీరాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తున్నట్లు చెబుతున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించడంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











