స్వీయ నిర్భందం.. శ్రీమతి సేవలో మోహన్ బాబు.. వైరల్ వీడియో
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలంతా పిట్టల్లారాలిపోతున్నారు. మన దేశంలోనూ కరోనా స్వైర విహారం చేస్తోంది. దీని దెబ్బకు దేశంలోని పలు రాష్ట్రాలు షట్ డౌన్‌ను ప్రకటించాయి. తాజాగా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి 31వరకు షట్ డౌన్ చేస్తున్నట్టు ప్రటించాడు. వారం రోజుల నుంచి కొందరు క్వారంటైన్ పేరిట ఇంటికే పరిమితమయ్యారు.
టాలీవుడ్ సెలెబ్రిటీలైతే.. వారం నుంచి ఇంటి పట్టునే ఉంటున్నారు. షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేయడం, అన్ని కార్యకలాపాలను రద్దు చేయడంతో ఇంట్లోనే గడుపుతున్నారు. ఇలా ఇంట్లో ఉంటూ సమయాన్ని వృథా చేయకుండా.. వర్కౌట్లు చేసుకుంటూ టైమ్ పాస్ చేసేస్తున్నారు. మరికొంత మంది పిల్లలు, ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు.

తాజాగా మోహన్ బాబు తన శ్రీమతికి సేవ చేస్తున్న వీడియోను బయటకు వదిలారు. మోహన్ బాబు భార్య సోఫాలో నిద్రిస్తుండగా.. మోహన్ బాబు విసనకర్రతో ఊపుతూ సేవ చేస్తున్నాడు. వారు ఇన్నేళ్లు చేసిన సేవకు రుణం తీర్చుకునే సమయం వచ్చింది.. మీ క్యారంటైన్ సమయంలో ఏం చేస్తున్నారో వీడియో ద్వారా తెలపండని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











