Mohan babu - Chiranjeevi: నేను మరిచిపోలేని ఘటన: చిరుపై మోహన్‌బాబు కామెంట్స్..
Mohan babu - Chiranjeevi: ప్రముఖ నటుడు మోహన్ బాబు గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో జరుగుతున్న కుటుంబ కలహాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి, ఆయనపై కేసు నమోదు కావడం ,ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారంటూ వస్తున్న వార్తలు చర్చనీయంగా మారాయి. ఈ తరుణంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. మీరు నటించిన సినిమాలన్నిటికీ మంచి ఆదరణ వచ్చింది. కలెక్షన్ల పరంగాను సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నిటికీ ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పొచ్చు. అలాంటి సినిమాల్లో ' పట్నం వచ్చిన పతివ్రతలు' ఒకటి. ఈ సినిమా 1982 లో విడుదలైంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ అన్నదమ్ములుగా నటించారు. ఇందులో మోహన్ బాబు అన్నగా నటించగా, చిరంజీవి తమ్ముడుగా నటించారు. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ మౌళి దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాధిక, గీతా హీరోయిన్గా నటించారు. కన్నడంలో వచ్చిన 'పట్టణక్కె బంద పత్నియరు'అనే సినిమాకు ఇది రీమేక్.
ఈ సినిమాలో రాంగోపాల్రావు, నూతన ప్రసాద్, రామ ప్రభ, నిర్మల పలువురు తదితర పాత్రలో నటించారు. ఈ సినిమాను శ్రీనివాస ప్రొడక్షన్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మని నారాయణరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు సత్యం సంగీతం అందించారు. ఈ సినిమా 1982 ఆగస్టు 1 న విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి.. అటు మోహన్ బాబు ,ఇటు చిరంజీవి కెరీర్లో మైలురాయిగా మారింది.

తాజాగా హీరో మోహన్ బాబు.. 'పట్నం వచ్చిన పతివ్రతలు' సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'పట్నం వచ్చిన ప్రతి వ్రతలు'కు సినిమాకు నా కెరీర్లో ప్రత్యేక స్థానం ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ మౌళి తేలకెక్కించిన చిత్రం ఇది. అందులో నేను పోషించిన పాత్రను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా నా స్నేహితుడు చిరంజీవి కి అన్నగా నటిస్తూ.. ఆయనతో స్క్రీన్ చేసుకోవడం మరపురాని అనుభూతి నిచ్చింది. నా సినీ కెరీర్లో మరిచిపోలేని సినిమాలలో ఈ సినిమా తప్పకుండా ఉంటుంది' అంటూ మోహన్ బాబు రాసుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన ట్వీట్ నెట్ లో వైరల్ అవుతుంది.
ఈ విషయాన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీలో మోహన్ బాబు చిరంజీవిలు మంచి స్నేహితులని అర్థమవుతుంది అయితే కొన్నాళ్లుగా వీరి మధ్య అంతగా మాటల్లేవ్ రాకపోకలు కూడా లేవు దీని మధ్య ఉన్న మనస్పర్ధలు మా ఎన్నికల టైం లో బయటపడ్డాయి ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నిలిచారు.


Click it and Unblock the Notifications











