చిరంజీవి అలా చేస్తే నా కొడుకును ఎన్నికల నుంచి తప్పిస్తా: 'మా' సమరంపై మోహన్ బాబు కామెంట్స్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA ఎన్నికలకు సంబంధించి అనేక రకాల వార్తలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు అందరు కూడా ఈ ఎన్నికలను హడావిడిలో చాలా బిజీ గా కనిపిస్తున్నారు. మొత్తం ఐదు మంది మొదట అధ్యక్ష పదవి కోసం ఎందుకు సిద్ధమయ్యారు. ఇక ఆ తర్వాత వాదోపవాదాల అనంతరం నెమ్మదిగా చర్చలు జరిపి ఇద్దరు ప్రముఖ నటులు ముఖాముఖి పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ యువ హీరో మంచు విష్ణు మా అధ్యక్ష పదవి కోసం ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే మంచు మోహన్ బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ మద్దతు ఇవ్వడంపై ఎవరూ ఊహించని విధంగా స్పందించారు.

పొలిటికల్ స్టైల్ లో విమర్శలు

పొలిటికల్ స్టైల్ లో విమర్శలు

మా ఎన్నికల బరిలో ఈసారి మొదట ఐదు మంది పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. అయితే వారిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ చర్చలు జరిపి పోటీ పడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నికల పై అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల తరహాలో ఒకరికొకరపై విమర్శలు కూడా చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కూడా మొదలయ్యింది.

మెగా మద్దతు vs నందమూరి, సూపర్ స్టార్ మద్దతు

మెగా మద్దతు vs నందమూరి, సూపర్ స్టార్ మద్దతు

అయితే ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు పోటీలో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రకాష్ రాజు వైపు మెగాస్టార్ తో పాటు నాగబాబు అలాగే ప్రముఖ నటి నటులు అందరూ కూడా మద్దతుగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక మరోవైపు మంచు విష్ణు కు మద్దతుగా నందమూరి బాలకృష్ణ అలాగే సూపర్ స్టార్ కృష్ణ సపోర్టు అందిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

మోహన్ బాబు ప్రచారాలు

మోహన్ బాబు ప్రచారాలు

ఇక మీడియా లో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతున్నావ్ ఇద్దరు పోటీదారులు కూడా ఘాటైన విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను తపలిస్తున్నారు. ఇక మంచు విష్ణుకి చాలా మంది మద్దతు ఉందని మోహన్ బాబు కూడా మరోవైపు ఇంటర్వ్యూ లో బలంగా తెలియజేస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు మెగాస్టార్ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వడంపై కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

మెగాస్టార్ మద్దతుపై..

మెగాస్టార్ మద్దతుపై..

మెగాస్టార్ చిరంజీవి తనకు ఏప్పటికైనా మంచి మిత్రుడు అంటూ నేనైతే నిరంతరం ఒక మంచి స్నేహితుడు లాగానే భావిస్తానని తెలియజేశారు. అయితే ఈ మా ఎన్నికల సమరంలో చర్చలు జరిపి ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ సఫలం కాలేదని ఆయన పరోక్షంగా తెలియజేశారు. మెగాస్టార్ ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనేది ఆయన వ్యక్తిగత విషయం అంటూ మోహన్ బాబు తన స్టైల్లోనే సమాధానం చెప్పారు.

మెగాస్టార్ అలా చేస్తే.. మంచు విష్ణుని వద్దని చెప్పేవాన్ని

మెగాస్టార్ అలా చేస్తే.. మంచు విష్ణుని వద్దని చెప్పేవాన్ని

ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారి పోటీ లోకి వారి కుటుంబ సభ్యుల పిల్లలను ఉంచితే తప్పకుండా మంచు విష్ణు నామినేషన్ ఉపసంహరించుకొమ్మని చెప్పేవాడినని మోహన్ బాబు తెలియజేశారు. కేవలం మెగాస్టార్ చిరంజీవి కాకుండా ఆయన కుటుంబ సభ్యులు నాగబాబు పిల్లలు, అలాగే అల్లు అరవింద్ గాని అంతే కాకుండా నాగార్జున పిల్లలు కూడా ఎన్నికల సమరంలో ఉంటే తప్పకుండా వెనక్కి పిలిచేవాడిని అని మంచు మోహన్ బాబు క్లారిటీ అయితే ఇచ్చారు.

Recommended Video

SP Balasubrahmanyam : సజీవ మూర్తిగా ఎస్పీ బాలు.. చీకటి వెలుగులతోపాటు | Mohan Lal | Filmibeat Telugu
శత్రుత్వం అయితే లేదు

శత్రుత్వం అయితే లేదు

ఇక చిరంజీవి మంచి స్నేహితుడు అయినప్పటికీ ఆయన మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ కు మాత్రం తాను ఏ విధంగానో మద్దతు ఇవ్వానని మోహన్ బాబు ఓపెన్ గానే వివరణ ఇచ్చారు. కేవలం మెగా ఫ్యామిలీ కి సంబంధించిన పిల్లలు ఎవరైనా సరే ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళు కూడా నా పిల్లలు అని అనుకునేవాడిని, కానీ చిరంజీవి ప్రకాష్ రాజ్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు అని అన్నారు. అయితే ప్రకాష్ రాజ్ తో తనకు ఏమాత్రం శత్రుత్వం కూడా లేదని మోహన్ కిడా బాబు తెలియజేశారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X