సన్‌ ఆఫ్ ఇండియా వచ్చేస్తున్నాడు: అతడి రక్తంలో దేశభక్తి ఉందన్న మోహన్ బాబు

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆరంభంలో విడుదల కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అందులో భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. దీంతో సంక్రాంతి సీజన్ మొత్తం సోసోగానే సాగిపోయింది. ఇక, ఇప్పుడు ఆ వైరస్ ప్రభావం తగ్గముఖం పట్టడంతో చాలా రాష్ట్రాల్లో మినహాయింపులు వచ్చాయి. దీంతో గతంలో ఆగిపోయిన చిత్రాలకు సంబంధించిన రిలీజ్ డేట్లను ఇప్పుడు వరుసగా ప్రకటిస్తున్నారు. భారీ సినిమాల విడుదలను బట్టి చిన్న మూవీలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో రిలీజ్ డేట్లు వస్తున్నాయి.

విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దాదాపు 500లకు పైగానే చిత్రాల్లో నటించిన ఆయన.. కొంత కాలగా సినిమాల వేగాన్ని తగ్గించారు. దీంతో ఈ మధ్య ఆయన చాలా తక్కువ మూవీల్లోనే నటిస్తున్నారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఆయన లీడ్ రోల్‌ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.

Mohan Babus Son Of India Release on February 18th

చాలా గ్యాప్ తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో పలుమార్లు దీనికి ఆటంకం ఏర్పడడంతో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేదు. దీంతో ఇది చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఫిబ్రవరి 18న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను కొద్ది సేపటి క్రితమే వెల్లడించారు.

'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ గెటప్‌తో యాంగ్రీగా కనిపిస్తున్నారు. ఇక, దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన 'తన రక్తంలో దేశభక్తి నిండి ఉంది' అంటూ వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సన్ ఆఫ్ ఇండియా' మూవీని పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. ఇందులో మోహన్ బాబు విభిన్నమైన గెటప్‌లతో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. ఇక, ఈ సినిమాకు మ్యూజికల్ లెజెండ్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ సహా ఎంతో మంది కీలక పాత్రలను పోషిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X