సంపూర్ణేష్ బాబు కోసం మోహన్ బాబు.. ఆనందంలో సంపూ

సంపూర్ణేష్ బాబు ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్న హీరో. అదే డైలాగ్ కింగ్ మోహన్ బాబు అయితే.. కొన్ని వందల సినిమాకు చేసి నటుడిగా, హీరోగా, నిర్మాతగా పలు రంగాల్లో నిష్ణాతుడైన వ్యక్తి. అలాంటి మోహన్ బాబు.. సంపూర్ణేష్ బాబు కోసం తన వంతు సహకారం అందిస్తుండటం అభినందించదగిన విషయం. ఇంతకీ సంపూర్ణేష్ బాబుకు మోహన్ బాబు అందిస్తున్న సహకారం ఏంటంటారా..? చూడండి మీకే తెలుస్తుంది.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కెరీర్‌లో మూడో సినిమాగా వస్తోంది 'కొబ్బరి మట్ట' మూవీ. కథ - స్క్రీన్ ప్లే - మాటలను స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు సంపూర్ణేష్ బాబు.

Mohan Babu Supports Sampoornesh Babus Kobbari Matta

ఈ రోజే జరగనున్న కొబ్బరిమట్ట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు విచ్చేస్తున్నారు. ఈ విషయమై ఆనందంగా ఉన్న సంపూ.. ''నాలాంటి చిన్న నటుడు అడగ్గానే మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న మా రియల్ పెదరాయుడుగారికి నా వందనాలు'' అని ట్వీట్ చేశాడు. కొబ్బరిమట్ట చిత్రంలో సంపూర్ణేశ్ పెదరాయుడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ రకంగా కొబ్బరిమట్ట చిత్రానికి మోహన్ బాబు సహకారం అందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X