అందుకే ఆ పేరు పెట్టారు.. జన్మ రహస్యాన్ని చెప్పిన మోహన్ బాబు

డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే టాలీవుడ్‌లో హడల్. ఆయన వస్తున్నాడంటే ఎక్కడి వారక్కడే గప్‌చుప్ అయిపోతారు. ఆయ పాటించే పద్దతులైనా, సమయపాలన ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకమే. అయితే గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చేసిన ప్రతీ సినిమా బెడిసికొట్టడంతో నిర్మాణానికీ దూరంగానే ఉన్నాడు. నేడు మహాశివరాత్రి సందర్బంగా తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

మహాశివరాత్రి సందర్భంగా..

మోహన్ బాబు.. తన ఇంట్లో జరిగిన ఓ అద్భుతాన్ని ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. తమ తల్లిదండ్రులు ఈశ్వరుడికి మొక్కుకుంటే తాను పుట్టానని మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా చెప్పుకొచ్చాడు. మహాశివరాత్రి అత్యద్భుతమైన రోజని.. ముఖ్యంగా తమ కుటుంబం గుర్తుపెట్టుకోవల్సిన రోజంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

అడివిలోని బత్తినీయస్వామి..

అడివిలోని బత్తినీయస్వామి..

ఎందుకంటే మాది తిరుపతి-కాళహస్తిల మధ్య ఉన్న చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెమని పేర్కొన్నాడు. మా అమ్మానాన్నలకు వివాహమై ఎన్నో ఏళ్ళు అయినా సంతానం కలగకపోతే ఎవరో ఓ సలహా చెప్పారట అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఇక్కడకి ఒక 5 కిలోమీటర్లు నడిచి, మరో 5 కిలోమీటర్లు కొండెక్కితే... అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి మొక్కుకుంటే పిల్లలు పుడతారని ఎవరో చెప్పినట్టు తెలిపాడు.

అందుకే ఆ పేరు..

అందుకే ఆ పేరు..

ఆ సలహాతో.. అలా భగవంతుడిని దర్శించుకుని వచ్చారని, అమ్మకు ఐదుగురు సంతానం కలిగినట్టు తెలిపాడు. అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారని జన్మ రహస్యాన్ని బయట పెట్టేశాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారిందని తెలిపాడు.

Recommended Video

Manchu Manoj Is Back In To Movies,Writes An Emotional Post | Aham Brahmasmi | Filmibeat Telugu
మా కుటుంబమంతా..

మా కుటుంబమంతా..

తనకు ఈశ్వరుడికి ఉన్న అనుబంధం అదేనని తెలిపాడు. తాను ఆయన ఆశీస్సులతో పుట్టినవాడినని, తమ కుటుంబమంతా ఆయన ఆశీస్సులతో పుట్టినవాళ్ళమేనని చెప్పుకొచ్చాడు. అందుకు మహాశివరాత్రి చాలా మంచి పర్వదినం. అందరికీ ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాని మోహన్‌బాబు ట్వీట్‌ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X