సింగపూర్ ఫ్లయిట్ గురించి మోహన్ బాబు వైరల్‌గా ట్వీట్!
కరోనావైరస్ కారణంగా స్వదేశ, విదేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు తమ వంతుగా సాయం చేస్తున్నారు. వలస కార్మికులను ఇంటికి చేర్చడానికి సోనుసూద్ లాంటి వాళ్లు బస్సులు, విమానాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సింగపూర్‌లో చిక్కుకున్న తెలుగు వారిని తమ సొంత ఊళ్లకు పంపించానికి సింగపూర్ తెలుగు సమాజం స్పందించింది.
సింగపూర్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి పంపించడానికి ప్రత్యేక విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేసింది. సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొనేలా ప్రైవేట్ చార్టెట్ ఫ్లయిట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు గానీ, మరే ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకొనే వారు తమ పేర్లను, వివరాలను [email protected] పంపించాలని సూచించారు.

అయితే సింగపూర్‌లో చిక్కకొని గత మూడు నెలలుగా బాధలు పడుతున్న వారికి సహాయం అందించేందుకు మోహన్ బాబు ముందుకొచ్చారు. ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్ సమాచారాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇది బాధితులకు చక్కటి అవకాశం. దీనిని ఉపయోగించుకొని తమ సొంత ప్రదేశాలకు చేరుకోండి అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
ఇప్పటికే కరోనా ఫండ్ కోసం భారీ విరాళాలను అందజేసిన మంచు ఫ్యామిలీ.. తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ అవకాశాన్ని అందరికి చేరే వేసే ప్రయత్నం చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











