Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోగా సెటిల్ అయ్యారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోన్న ఆయన.. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ఏజ్ బార్ అవుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ మధ్య వరస పెట్టి సినిమా చేసుకుంటూ వచ్చిన ఈ సీనియర్ హీరో.. ఇటీవలి కాలంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ఓ సందేశాత్మక చిత్రం చేస్తున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం అందిస్తోన్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది.
'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ పోస్టర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలో దీన్ని జనవరి 29న ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే, దానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అందులో మువ్వన్నెల జెండాపై సినిమాపై టైటిల్ ఉంది. అలాగే, ఓ కుర్చీ దానికి ముందు టేబుల్ ఉన్నాయి. అలాగే, దానిపై కొన్ని వాకీటాకీలు కూడా ఉన్నాయి. దీంతో ఈ సినిమా పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కనుందని అర్థం అవుతోంది.