twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

    |

    విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోగా సెటిల్ అయ్యారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోన్న ఆయన.. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ఏజ్ బార్ అవుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ మధ్య వరస పెట్టి సినిమా చేసుకుంటూ వచ్చిన ఈ సీనియర్ హీరో.. ఇటీవలి కాలంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ఓ సందేశాత్మక చిత్రం చేస్తున్నారు.

    సుదీర్ఘ విరామం తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం అందిస్తోన్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది.

    Mohan Babus Son Of India First Look Release Date Fix

    'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ పోస్టర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలో దీన్ని జనవరి 29న ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే, దానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అందులో మువ్వన్నెల జెండాపై సినిమాపై టైటిల్‌ ఉంది. అలాగే, ఓ కుర్చీ దానికి ముందు టేబుల్ ఉన్నాయి. అలాగే, దానిపై కొన్ని వాకీటాకీలు కూడా ఉన్నాయి. దీంతో ఈ సినిమా పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కనుందని అర్థం అవుతోంది.

    English summary
    Manchu Bhakthavatsalam Naidu, known popularly as Mohan Babu, is an Indian actor and producer, known for his works predominantly in Telugu cinema. An alumnus of the Madras Film Institute, Mohan Babu has acted in more than five hundred feature films in lead, supporting and a variety of roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X