నాని జెంటిల్మన్‌తో మ్యాజిక్.. హ్యాట్రిక్‌కు సిద్దమవుతున్న ఇంద్రగంటి!
అష్టాచెమ్మా సినిమా నేచురల్ స్టార్ నానీకి బ్రహ్మండమైన కెరీర్‌కు బాట వేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి.. ఆయనకు జెంటిల్మన్ రూపంలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందించారు. ఆ తర్వాత సమ్మోహనం సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. కంటెంట్, క్యారెక్టర్లతో మ్యాజిక్ చేసే ఇంద్రగంటి తాజాగా మరోసారి విభిన్నమైన కథతో ఫీల్‌గుడ్ క్యారెక్టర్లతో మరో సినిమాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా చరత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఆదిత్య 369 అనే చిత్రాన్ని నిర్మించిన శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ తమ సంస్థలో 15వ చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రియదర్శి, రూప కొడువాయూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆఫీస్‌లో దేవుడి చిత్రపటాలపై ముహుర్తం షాట్‌ను చిత్రీకరించి పూజా కార్యక్రమాలు ముగించారు.

ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ కొట్టగా, దర్శకుడు ఇంద్రగటి భార్య ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ పూజా కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఇంద్రగంటితో శివలెంకకు ఇది మూడో చిత్రం. ఈ మూవీ కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు.
మా బ్యానర్‌లో ఇంద్రగంటితో మాకు మూడో చిత్రం. నానితో జెంటిల్మన్, సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమాలు రూపొందించాం. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకొన్నాయి. బలగంతో మంచి సక్సెస్ సాధించిన ప్రియదర్శికి కచ్చితంగా సరిపోయే సినిమా ఇది. జంధ్యాల మార్క్ ఉండే సినిమా అని శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.

నటీనటులు: ప్రియదర్శి, రూప కొడవాయూర్, వీకే నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కేఎల్‌కే మణి తదితరులు,
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా
మ్యూజిక్: వివేక్ సాగర్
లైన్ ప్రొడ్యూసర్స్: విద్య శివలెంక, లిపిక ఆళ్ల
కాస్ట్యూమ్స్: మనోజ్
కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్-శ్రీదేవి
ప్రొడక్షన్ కంట్రోలర్స్: రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు
పీఆర్వో: పులగం చిన్నారాయణ
కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్: వెంకట్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్


Click it and Unblock the Notifications











